మాదక ద్రవ్యాలకు దూరంగా యువత ఉండాలి
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:55 PM
యువత మత్తు పానియాలు, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కోరారు. పైడిభీమవరంలో 16 రోజుల పాటు టీడీపీ నాయకుడు రౌతు శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో ఆర్‌ఎస్‌ఆర్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా 45 జట్లతో టోర్నమెంట్ నిర్వహిం చారు.

ఫఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు
రణస్థలం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): యువత మత్తు పానియాలు, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కోరారు. పైడిభీమవరంలో 16 రోజుల పాటు టీడీపీ నాయకుడు రౌతు శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో ఆర్‌ఎస్‌ఆర్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా 45 జట్లతో టోర్నమెంట్ నిర్వహిం చారు.ఈ సందర్భంగా సోమవారం నాతవలస, వరిసాం మధ్య ఫైనల్ మ్యాచ్ జరి గిం ది. ఈమేరకు నాతవలస విజయం సాధించగా, వరిసాం రన్నర్‌గా నిలిచింది. నాత వలసజట్టుకు ఎమ్మెల్యే ఈశ్వరరావు బహుమతి ప్రదానంచేశారు.కార్యక్రమంలో నాయకు లు గొర్లె లక్ష్మణరావు, పిసిని హరి, కనకారావు, గొర్లె సాయి పాల్గొన్నారు.