Political Request : లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి
ABN , Publish Date - Jan 19 , 2025 | 06:14 AM
మంత్రి నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని సీఎం చంద్రబాబును ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసరెడ్డి కోరారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు లోకేశ్ అలుపెరగని సుదీర్ఘ పాదయాత్ర చేశారని

చంద్రబాబుకు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి వినతి
మైదుకూరు, జనవరి 18: మంత్రి నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని సీఎం చంద్రబాబును ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసరెడ్డి కోరారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు లోకేశ్ అలుపెరగని సుదీర్ఘ పాదయాత్ర చేశారని అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని తెలిపారు. ‘‘పార్టీ ఆవిర్భవించి 42ఏళ్లు అయింది. ఇప్పుడు మూడోతరం నడుస్తోంది. భవిష్యత్తు కోసం, పార్టీని నమ్ముకున్న యువత కోసం లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలి. దీనివల్ల యువతరానికి పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబును శ్రీనివాసరెడ్డి కోరారు.