Share News

దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:57 PM

ఆత్మకూరు పోలీసు స్టేషనలో నమోదైన ఓ దొంగతనం కేసుకు సంబంధించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు అర్బన సీఐ రాము శుక్రవారం తెలిపారు.

    దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు

ఆత్మకూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు పోలీసు స్టేషనలో నమోదైన ఓ దొంగతనం కేసుకు సంబంధించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు అర్బన సీఐ రాము శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు పట్టణంలోని మార్కెట్‌యార్డు వద్ద గల ఓ బీరువాల దుకాణంలో ఈ నెల 25న రాత్రి గాయబ్‌ అనే వ్యక్తి నిద్రిస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆయన వద్దకు వచ్చి కడియంతో గాయపరిచి సెల్‌ఫోనతో పాటు రూ.50 దోచుకున్నట్లు తెలిపారు. దీంతో బాధితుడు కేకలు వేయడంతో ఇద్దరు దొంగలు బైక్‌పై పరారయ్యారని చెప్పారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బందిపోటు దొంగతనం కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో ఆత్మకూరు పట్టణానికి చెందిన ముర్తుజావలి, రమణ అనే ఇద్దరు దొంగలను పట్టణ శివార్లలోని ఉర్ధూ స్కూల్‌ వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి బైకును, కడియాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ఎస్సై నారాయణరెడ్డి, సిబ్బంది రవి, శివరామ్‌, లక్ష్మణ్‌, వెంకటస్వామి, రంగస్వామి, అమీర్‌ ప్రతిభ కనబర్చినట్లు చెప్పారు.

Updated Date - Mar 28 , 2025 | 11:57 PM