Share News

Visakhapatnam: నాలుగు నెలల్లో విశాఖ మాస్టర్‌ ప్లాన్‌

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:44 AM

విశాఖపట్నం నగర అభివృద్ధితోపాటు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై జీవీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ శుక్రవారం అమరావతి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Visakhapatnam: నాలుగు నెలల్లో విశాఖ మాస్టర్‌ ప్లాన్‌

రాబోయే 30 ఏళ్లకు రూపకల్పన: మంత్రి నారాయణ

జీవీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష

అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ‘విశాఖపట్నం అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ను నాలుగు నెలల్లోగా సిద్ధం చేస్తాం. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందిస్తున్నాం’ అని మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నం నగర అభివృద్ధితోపాటు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై జీవీఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ శుక్రవారం అమరావతి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్‌ బాబు, వంశీ కృష్ణ శ్రీనివాస్‌, విష్ణుకుమార్‌రాజు, ఏపీయూఎ్‌ఫఐడీసీ చైర్మన్‌ పీలా గోవింద్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైజాగ్‌లో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్‌ సమస్యలు, మెట్రో రైల్‌ ప్రాజెక్టు, భూముల ఆక్రమణ, తాగునీటి సమస్య, టీడీఆర్‌ బాండ్లు, యూజీడీ తదితర అంశాలను సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. సమావేశం అనంతరం మంత్రి నారాయణతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు.


టీడీఆర్‌ బాండ్లపై స్పెషల్‌ డ్రైవ్‌

‘గత ప్రభుత్వం స్వార్థంతో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. భవిష్యత్‌ ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకొని మళ్లీ మార్పులు చేసి, ప్రజాభిప్రాయంతో ఫైనల్‌ ప్లాన్‌ విడుదల చేస్తాం. విశాఖలో కొన్ని చోట్ల రోడ్లు వెడల్పు చేయాల్సి ఉంది. మెట్రో రైల్‌ కూడా మాస్టర్‌ ప్లాన్‌లో భాగమే. టీడీఆర్‌ బాండ్లపై అన్ని మున్సిపాలిటీల్లో స్పెషల్‌ డ్రైవ్‌ జరుగుతోంది. త్వరలోనే పరిష్కారమవుతాయి.’ అని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొణతాల మాట్లాడుతూ, ‘వైజాగ్‌ అభివృద్ధిపై జరిగిన సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వివిధ సమస్యల పరిష్కారానికి మంత్రి నారాయణ అంగీకారం తెలిపారు’ తెలిపారు. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు విష్ణుకుమార్‌ రాజు మాస్టర్‌ ప్లాన్‌పై మాట్లాడారు. కాగా, రాష్ట్రంలో టౌన్‌ప్లానింగ్‌లో సంస్కరణలు అమలు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం టౌన్‌ప్లానింగ్‌పై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ఎక్కడ ఎలాంటి నిర్మాణం చేసినా అన్నీ రకాలుగా ఆహ్లాదకరంగా ఉండాలి. అసోషియేషన్‌ తరఫున కొన్ని మినహాయింపులు కావాలని బిల్డర్లు కోరారు. కొన్ని సాధ్యం కాదని తేల్చి చెప్పాం.’ అని మంత్రి నారాయణ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 04:44 AM