Share News

బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలి

ABN , Publish Date - Mar 22 , 2025 | 01:09 AM

రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాను మాంసం, కూరగాయల ఉత్పత్తి క్లస్టర్‌గా ప్రకటించినందున వ్యవసాయ, డెయిరీ, పౌలీ్ట్ర రంగాలకు బ్యాంకులు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ త్రైమాసిక సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది.

బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

మాంసం, కూరగాయల ఉత్పత్తి క్లస్టర్‌గా జిల్లా

వచ్చే ఏడాదికి 17 శాతం వృద్ధి

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అనకాపల్లి కలెక్టరేట్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాను మాంసం, కూరగాయల ఉత్పత్తి క్లస్టర్‌గా ప్రకటించినందున వ్యవసాయ, డెయిరీ, పౌలీ్ట్ర రంగాలకు బ్యాంకులు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ త్రైమాసిక సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాంసం, కూరగాయల ఉత్పత్తిలో వచ్చే సంవత్సరానికి 17 శాతం వృద్ధి రావాలని అందుకు అనుగుణంగా యూనిట్లు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. యువతకు ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహించాలని, ఆయా యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో పశువులు, గొర్రెలు, నాటుకోళ్ల పెంపకం, మైదాన ప్రాంతంలో కూరగాయల సాగు పెంచాలన్నారు. కౌలు రైతులకు కూడా పంట రుణాలు అందించాలని అన్నారు. ఉన్నత విద్యకు రుణాలు ఇవ్వాలని, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఆయా శాఖల అధికారులు, బ్యాంకుల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వ్యవసాయ, అనుబంధ రంగాలను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ఉత్పత్తి అవుతున్న వస్తువులకు బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని తెలిపారు.

పీ-4 సర్వే 99.86 శాతం పూర్తి: కలెక్టర్‌

అనకాపల్లి రూరల్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా దాతృత్వ ప్రజల భాగస్వామ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పీ-4 సర్వేకు సంబంధించి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సర్వే ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన 20 శాతం మందిని ఆర్థికంగా సంపన్నులైన పది శాతం మంది మద్దతుతో శక్తివంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. జిల్లాలో పీ-4 సర్వే 99.86 శాతం పూర్తయిందని తెలిపారు.

Updated Date - Mar 22 , 2025 | 01:09 AM