మండుతున్న ఎండలు
ABN , Publish Date - Mar 20 , 2025 | 10:59 PM
మన్యంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గురువారం జిల్లా కేంద్రం పాడేరుతో సహా అన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రంగానే కాసింది.

పాడేరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): మన్యంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గురువారం జిల్లా కేంద్రం పాడేరుతో సహా అన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రంగానే కాసింది. ముంచంగిపుట్టులో 35.5, పెదబయలులో 35.4, కొయ్యూరులో 35.3, అరకులోయలో 34.4, డుంబ్రిగుడలో 33.9, చింతపల్లిలో 33.5, హుకుంపేటలో 32.9, జీకేవీధిలో 31.4, జి.మాడుగులలో 31.2, అనంతగిరిలో 30.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.