Share News

విశాఖ చేరుకున్న లఖ్ నవూ సూపర్‌ జెయింట్స్‌

ABN , Publish Date - Mar 22 , 2025 | 01:09 AM

స్థానిక ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న లఖ్ నవూ సూపర్‌ జెయింట్స్‌ జట్టు శుక్రవారం నగరానికి చేరుకుంది.

విశాఖ చేరుకున్న లఖ్ నవూ సూపర్‌ జెయింట్స్‌

24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌

విశాఖపట్నం-స్పోర్ట్సు/గోపాలపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి):

స్థానిక ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న లఖ్ నవూ సూపర్‌ జెయింట్స్‌ జట్టు శుక్రవారం నగరానికి చేరుకుంది. రాత్రి 7.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న ఆటగాళ్లు అక్కడ నుంచి ప్రత్యేక బస్సులలో హోటల్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. లఖ్ నవూ సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌తోపాటు డేవిడ్‌ మిల్లర్‌, మార్‌క్రమ్‌, హిమ్మత్‌ సింగ్‌, మాథ్యూ బ్రిజ్‌టెక్‌, నికోలస్‌ పూరన్‌, ఆర్యన్‌ జుయల్‌, మిచెల్‌ మార్ష్‌, అబ్దుల్‌ సమద్‌, షాబాజ్‌ అహ్మద్‌, యువరాజ్‌ చౌధరి, రాజ్‌వర్ధన్‌ హంగ్రేకర్‌, అర్షిన్‌ కులకర్ణి, ఆయుష్‌ బదోని, అవేశ్‌ ఖాన్‌, ఆకాశ్‌ దీప్‌, సిద్దార్థ్‌, దిగ్వేష్‌ సింగ్‌, ఆకాశ్‌ సింగ్‌, షమర్‌ జోసెఫ్‌, ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌, మొహిసిన్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌, మరో 25 మంది సపోర్టింగ్‌ సిబ్బంది విశాఖ చేరుకున్నారు. శని, ఆదివారాల్లో నెట్‌ ప్రాక్టీస్‌ చేసి సోమవారం రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడనున్నారు.

Updated Date - Mar 22 , 2025 | 01:09 AM