Share News

అరకు వద్ద కారు బోల్తా..

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:26 PM

కారు బోల్తా పడడంతో గంజాయి రవాణా గుట్టు రట్టయింది.

అరకు వద్ద కారు బోల్తా..
బోల్తా పడిన ఇన్నోవా కారు

గంజాయి రవాణా గుట్టురట్టు

280 కిలోల గంజాయి స్వాధీనం

డుంబ్రిగుడ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కారు బోల్తా పడడంతో గంజాయి రవాణా గుట్టు రట్టయింది. స్థానిక పోలీసులు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి కారు వెళుతోంది. అరకు గ్రామ సమీపంలోకి వచ్చేసరికి కారు బోల్తా పడింది. దీంతో అందులో ఉన్నవారు పరారీ అయ్యారు. అయితే కారు బోల్లా పడిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బోల్తా కొట్టిన వాహానాన్ని పరిశీలించారు. అందులో మూటలు ఉండడంతో అనుమానం వచ్చి వాహనం అద్దాలను పగులగొట్టి పరిశీలించారు. కారులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. ఆ గంజాయిని తూకం వేయగా 280 కిలోలు ఉంది. గంజాయిని స్వాధీనం చేసుకొని, కారును పోలీసు స్టేషన్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైటర్‌ ధర్మేంద్ర తెలిపారు.

Updated Date - Mar 22 , 2025 | 11:26 PM

News Hub