Share News

డ్రగ్స్‌ విక్రయిస్తున్న కర్ణాటక వాసి అరెస్టు

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:35 AM

అత్యంత ఖరీదైన ఎండీఎంఏ పౌడర్‌ (డ్రగ్‌)ను విక్రయించేందుకు యత్నిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 6.5 గ్రాముల ఎండీఎంఏ పౌడర్‌ను స్వాధీనం చేసుకుని త్రీ టౌన్‌ పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని రంగవల్లి విల్లగె జిల్లా కొత్తగారే ప్రాంతానికి చెందిన రంగస్వామి నంజిగౌడ (23) పదో తరగతి వరకు చదువుకున్నాడు.

డ్రగ్స్‌ విక్రయిస్తున్న కర్ణాటక వాసి అరెస్టు
టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎండీఎంఏ పౌడర్‌

6.5 గ్రాముల ఎండీఎంఏ పౌడర్‌ స్వాధీనం

విశాఖపట్నం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి):

అత్యంత ఖరీదైన ఎండీఎంఏ పౌడర్‌ (డ్రగ్‌)ను విక్రయించేందుకు యత్నిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 6.5 గ్రాముల ఎండీఎంఏ పౌడర్‌ను స్వాధీనం చేసుకుని త్రీ టౌన్‌ పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని రంగవల్లి విల్లగె జిల్లా కొత్తగారే ప్రాంతానికి చెందిన రంగస్వామి నంజిగౌడ (23) పదో తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి చిన్నతనంలోనే మరణించగా, తల్లి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రంగస్వామి అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు. బెంగళూరు నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్నాడు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న సాయిరాం డార్మెటరీలో బస చేశాడు. బుధవారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్‌ మైదానం వద్ద ఉండగా, మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగస్వామిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతని వద్ద 6.5 గ్రాముల ఎండీఎంఏ పౌడర్‌ లభ్యమైంది. అతడిని విచారించగా గతంలో కూడా నగరానికి వచ్చి మాదకద్రవ్యాలను విక్రయించాడని తేలింది. కేసు దర్యాప్తు కోసం రంగస్వామిని త్రీటౌన్‌ పోలీసులకు అప్పగించారు.

Updated Date - Mar 27 , 2025 | 01:35 AM