అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణకు 31న లోకేశ్ శంకస్థాపన
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:06 AM
అనకాపల్లి- అచ్యుతాపురం రహదారి విస్తరణ పనులకు ఈ నెల 31వ తేదీన మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు.

రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ
అచ్యుతాపురం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి- అచ్యుతాపురం రహదారి విస్తరణ పనులకు ఈ నెల 31వ తేదీన మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసరెడ్డితో సమావేశమై రోడ్డు గురించి చర్చించారు. అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటైన తరువాత అచ్యుతాపురానికి ప్రాధాన్యత ఏర్పడిందని, అనకాపల్లి- అచ్యుతాపురం మధ్య నాలుగు లేన్ల రహదారి అవసరమన్నారు. ఇంకా ఎలమంచిలి-అచ్యుతాపురం, పరవాడ-అచ్యుతాపురం రహదారులను కూడా విస్తరించాల్సిన అవసరం వుందన్నారు.