పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:14 AM
వడ గండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం చీకురాయి, భోజన్నపేట, హన్మంతునిపేట గ్రామాల్లో ఎమ్మెల్యే నష్టపోయిన పంటలను పరిశీలించారు.

పెద్దపల్లి రూరల్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): వడ గండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం చీకురాయి, భోజన్నపేట, హన్మంతునిపేట గ్రామాల్లో ఎమ్మెల్యే నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాలవర్షంతో వరి, మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని, తక్ష ణమే నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదే శించారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పదేళ్ళు అధికారంలో ఉన్న వారు నష్టపోయిన రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రస్తుతం తాము రైతులు నష్టపో కుండా కృషి చేస్తున్నామన్నారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకున్నామని, గుంట భూమి కూడా ఎండిపోకుండా నీరందించేందుకు కృషి చేస్తాన న్నారు. రైతులు తూములు, కెనా ల్ కాలువ గేట్లను ధ్వంసం చేసి నీరును వృథా చేయవద్దన్నారు. అలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయన్నారు. రైతులు, వ్యవసాయ అధికా రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులు అఽధైర్య పడ వద్దని అండగా ఉంటానని ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణా రావు భరోసా ఇచ్చారు. ధూళి కట్టలో దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, పత్తి పంటలను అంచనా వేయాలని అధికారులను ఆదేశిం చారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, యువజన కార్యదర్శి దుగ్యాల సంతోష్‌రావు, ఏవో ఉమాపతి, ఏఈవోలు గణేష్, సురేష్, నాయకులు దేవరాజ్, పాల శ్రీనివాస్‌రావు, పాల్గొన్నారు.
జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావు అన్నారు. కోనరావుపేట, జూలపల్లి గ్రామాల్లో వడగండ్ల వర్షంతో నష్టపోయిన మొక్క జొన్న పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు నష్టపరి హారాన్ని అందించేందుకు కృషి చేస్తానన్నారు. సాగు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. పార్టీ మండల అధ్యక్షుడు బొజ్జ శ్రీని వాస్, నాయకులు జలపతిరెడ్డి, కొమురయ్య, మల్ల య్య,స్వామి, పొట్యాల బీరయ్య రైతులు పాల్గొన్నారు.