ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏ పరీక్ష పరిశీలన
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:13 AM
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జాతీయ సార్వత్రిక విద్యా సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వయోజనులకు ఆదివారం ఎల్‌ఎఫ్‌ఎన్‌ఏ పరీక్ష నిర్వహించారు.

ఆత్మకూరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జాతీయ సార్వత్రిక విద్యా సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వయోజనులకు ఆదివారం ఎల్‌ఎఫ్‌ఎన్‌ఏ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాపురంలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఈ పరీక్షను వయోజన విద్య జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలోని 28 మండలాల్లో మొదటి విడతగా స్వయం సహాయ సంఘాల్లోని 26,785 మంది నిరక్ష్యరాస్యులను గుర్తించి 2677 కేంద్రాల ద్వారా ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా 15 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిగిన చదువు రాని వయోజనులకు అక్షరాస్యత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించిన వారికి జాతీయ సార్వత్రిక విద్యా సంస్థ ద్వారా ధృవీకరణ పత్రాలను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పాఠశాల ఉపాధ్యాయులు జయమ్మ, శోభ, నాగమణి ఉన్నారు.