మహిళలకే వ్యవసాయ యాంత్రీకరణ
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:17 AM
వ్యవసాయ రంగంలోనూ యంత్రాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్ది కూలీల కొరత ఏర్పడుతోంది. దీనిని అధిగమిం చేందుకు వివిధ రకాల యంత్రాలు వస్తున్నాయి. యం త్రాలను వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈసారి మహి ళలకే వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
వ్యవసాయ రంగంలో యేటా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా సాగులో ఆధునిక పని ముట్లను వినియోగిస్తున్నారు. వీటిని సబ్సిడీపై అందించే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఎనిమిదేళ్ల తర్వాత ప్రారంభానికి నోచుకొంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం 24కోట్ల 90లక్షల రూపాయల సబ్సిడీని రైతులకు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తు న్నది. రాష్ట్ర వ్యాప్తంగా 10,812 మంది లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీ సొమ్మును అందజేయనున్నారు. ఈసారి మహిళలకే వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు ఇవ్వా లని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా కేటా యింపులు కూడా చేశారు.
వ్యవసాయ రంగంలోనూ యంత్రాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. వరి నాటు వేసే యంత్రం, వరి కోత మిషన్, మొక్కజొన్న పంటను కోయడం, కంకులు పట్టడం ఇలా పలు రకరకాల యంత్రాలు విని యోగంలోకి వస్తున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తు న్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా వివిధ రకాల యంత్రాలు, పనిముట్లపై 40 నుంచి 70 శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది. ఈ పథ కానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే అమలు చేస్తోంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని కొనసాగించింది. అన్ని రకాల పనిముట్లకు బదులు ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు 80 శాతం సబ్సిడీపై, ఇతరు లకు 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేశారు. ఈ పథకం ద్వారా అధికంగా పార్టీ కార్యకర్తలకే లబ్ధి చేకూర్చడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అర్హులు కాని వారికి కూడా సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేశారు. ఈ పథకంలో గులాబీ నేతల జోక్యం పెరగడంతో అర్హులైన లబ్ధిదారులకు ట్రాక్టర్లు అందకుండా పోయాయి. రైతుల్లో ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత పెరిగింది. పరిస్థితి గమ నించిన ప్రభుత్వం 2017-18 వరకే వ్యవసాయ యాంత్రీ కరణ పథకాన్ని కొనసాగించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండోసారి గెలిచిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అటకెక్కించింది. కనీసం కేంద్ర ప్రభుత్వం ఆర్‌కేవీవై ద్వారా కేటాయించిన నిధులను సైతం సద్వినియోగం చేసుకోలేక పోయింది. 2018 యాసింగి సీజన్ నుంచి రైతుబంధు పథకాన్ని అమల్లోకి తీసుకవచ్చింది. వ్యవసాయ యాంత్రీకరణ, జీరో వడ్డీకే పంట రుణాలు, పంటల బీమా పథకాలను అమలు చేయలేదు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారం లోకి వస్తే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమ ల్లోకి తీసుకవస్తామని ప్రకటించింది. ఆ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం రూ.24 కోట్ల 90 లక్షల సబ్సిడీ నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాకు రూ. 58.84 లక్షలు కేటాయించారు.
నెలాఖరులోగా దరఖాస్తుల స్వీకరణ
ఈ నెలాఖరులోగా మహిళా రైతుల నుంచి దర ఖాస్తులు స్వీకరించనున్నారు. ఆయా మండలాలకు చేసిన కేటాయింపులను అనుసరించి లక్ష రూపాయల లోపు యూనిట్ ఉంటే మండల వ్యవసాయ శాఖ అధికారి కన్వీనర్‌గా ఉన్న కమిటీ, లక్షకు మించితే కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. పవర్ స్పేయర్లు, డ్రోన్లు, రోటోవేటర్లు, సీడ్‌కమ్ ఫర్టిలైజర్ డ్రిల్, కల్టివేటర్లు, ప్లవ్, కేజ్‌వీల్స్, రోటో ఫడ్లర్లు, బండ్ ఫార్మర్ యూనిట్లు, పవర్ వీడర్లు, బ్రష్ కట్టర్, పవర్ టిల్లర్లు, ట్రాక్టర్లు, మొక్కజొన్న వొలిచే షెల్లర్లు, తదితర యంత్రాలు, పనిముట్లను అందజేయ నున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత వ్యవసాయ యాంత్రీకర ణకు ప్రభుత్వం సబ్సిడీ నిధులు కేటాయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.