కలెక్టరేట్‌లో పీ4 పోస్టర్ ఆవిష్కరణ
ABN , Publish Date - Mar 20 , 2025 | 10:58 PM
రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా శాఖ రూపొందించిన పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ పార్ట్‌నర్‌షిప్) పోస్టర్‌ను అధికారులతో కలిసి కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ గురువారం ఆవిష్కరించారు.

పాడేరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా శాఖ రూపొందించిన పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ పార్ట్‌నర్‌షిప్) పోస్టర్‌ను అధికారులతో కలిసి కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ గురువారం ఆవిష్కరించారు. పీ4 విధానంతో పేదరికం లేని సమాజాన్ని రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర- 2047 సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, డీఎస్‌పీ సహబాజ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(టీడబ్ల్యూ) లోకేశ్, సీపీవో పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.