రంగురాళ్ల క్వారీలు, టేకు ప్లాంటేషన్‌పై ప్రత్యేక నిఘా
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:14 AM
రంగురాళ్ల క్వారీలు, టేకు ప్లాంటేషన్ పరిరక్షణకు ప్రత్యేక నిఘా పెట్టామని స్థానిక అటవీశాఖ రేంజ్ అధికారి బి. అప్పారావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రేంజ్ పరిధిలో గుర్రాళ్లగొంది, దొడ్డిగొండ రంగురాళ్ల క్వారీలు ఉన్నాయన్నారు. ఈ క్వారీల్లో వర్షాలు పడిన సమయంలో వ్యాపారుల ప్రోత్సాహంతో కూలీలు తవ్వకాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రస్తుతం వర్షాలు పడడంతో అటవీశాఖ సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు.

- బేస్ క్యాంప్ సిబ్బందితో 24 గంటలు గస్తీ
- రేంజ్ అధికారి బి.అప్పారావు
చింతపల్లి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రంగురాళ్ల క్వారీలు, టేకు ప్లాంటేషన్ పరిరక్షణకు ప్రత్యేక నిఘా పెట్టామని స్థానిక అటవీశాఖ రేంజ్ అధికారి బి. అప్పారావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రేంజ్ పరిధిలో గుర్రాళ్లగొంది, దొడ్డిగొండ రంగురాళ్ల క్వారీలు ఉన్నాయన్నారు. ఈ క్వారీల్లో వర్షాలు పడిన సమయంలో వ్యాపారుల ప్రోత్సాహంతో కూలీలు తవ్వకాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రస్తుతం వర్షాలు పడడంతో అటవీశాఖ సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు. రంగురాళ్ల తవ్వకాలను కట్టడి చేసేందుకు 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. గుర్రాళ్లగొంది రంగురాళ్ల క్వారీ వద్ద నలుగురు బేస్ క్యాంప్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. రంగురాళ్ల క్వారీల్లో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరించినా, తవ్వకాలు నిర్వహించేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాగే చెదలపాడు, ముల్లుమెట్ట, పెదకొత్తూరు, రౌరింతాడ, ఏపీఆర్‌జేసీ, కిన్నెర్ల వద్ద టేకు ప్లాంటేషన్లు ఉన్నాయన్నారు. ఈ వనాలు 1965-68, 1973 నాటినవని తెలిపారు. ఈ విలువైన టేకు వనాలు స్మగ్లర్ల చేతిలో పడకుండా అటవీశాఖ ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ టేకు వనాల పరిరక్షణకు బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.