మోదకొండమ్మను తాకిన సూర్యకిరణాలు
ABN , Publish Date - Mar 20 , 2025 | 11:00 PM
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఆలయ గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని గురువారం సూర్యోదయం వేళ భానుడి కిరణాలు తాకాయి.

పరవశించిన భక్తులు
పాడేరురూరల్, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఆలయ గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని గురువారం సూర్యోదయం వేళ భానుడి కిరణాలు తాకాయి. దీంతో అమ్మవారి విగ్రహం ప్రకాశవంతంగా కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకుడు సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు.