A key development కీలక పరిణామం
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:03 AM
A key development బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ వెంకటమురళీకృష్ణారావు(వైసీపీ)పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే దిశగా బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ బొబ్బిలి పట్టణ అధ్యక్షుడు, 8వ వార్డు కౌన్సిలర్ రాంబార్కి శరత్‌బాబు, మున్సిపల్ టీడీపీ ఫ్లోర్‌లీడరు, ఆరోవార్డు కౌన్సిలర్ గెంబలి శ్రీనివాసరావు, మూడో వార్డు కౌన్సిలర్ బొత్స సురేష్‌కుమార్‌లు కలిసి కలెక్టర్ అంబేడ్కర్‌కు నోటీసు అందజేశారు.

కీలక పరిణామం
మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసానికి నోటీస్
కలెక్టర్‌కు అందజేసిన టీడీపీ కౌన్సిలర్లు
బొబ్బిలి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ వెంకటమురళీకృష్ణారావు(వైసీపీ)పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే దిశగా బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ బొబ్బిలి పట్టణ అధ్యక్షుడు, 8వ వార్డు కౌన్సిలర్ రాంబార్కి శరత్‌బాబు, మున్సిపల్ టీడీపీ ఫ్లోర్‌లీడరు, ఆరోవార్డు కౌన్సిలర్ గెంబలి శ్రీనివాసరావు, మూడో వార్డు కౌన్సిలర్ బొత్స సురేష్‌కుమార్‌లు కలిసి కలెక్టర్ అంబేడ్కర్‌కు నోటీసు అందజేశారు. దీంతో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఖాయమని తేలిపోయింది.
బొబ్బిలి మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉండగా, అందులో 21 వ వార్డుకౌన్సిలరు మరిశర్ల రామారావు వైసీపీ నుంచి గెలుపొంది, ఆ పార్టీని, కౌన్సిలర్ పదవిని వీడి గత ఏడాది బీజేపీలో చేరిపోయారు. ఆ వార్డుకు ప్రస్తుతం కౌన్సిలర్ ఎవరూ లేరు. మిగిలిన 30 వార్డులలో 20 వైసీపీ, 10 టీడీపీ ఖాతాలో ఉన్నాయి. వైసీపీలో ఉన్న 20 మందిలో నుంచి 10 మంది చైర్మన్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీకి చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లు తొలుత ముందుకు వచ్చి సంతకాలు చేశారు. రెండు రోజుల ముందు 26వ వార్డు కౌన్సిలరు మరిపి తిరుపతిరావు కూడా తొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్ల చెంత చేరిపోయారు. ఇది తెలుగుదేశం పార్టీకి బాగా సానుకూలమైంది. మొత్తం 20 మంది కౌన్సిలర్ల బలం, ఒక ఎక్స్ అఫీషియోసభ్యుని (ఎమ్మెల్యే) ఓటు టీడీపీ ఖాతాలో చేరినట్టయింది. చైర్మన్‌పై అసమ్మతిని బహిరంగంగా వ్యక్తపరిచిన 10 మంది వైసీపీ కౌన్సిలర్లు ప్రత్యేక రహస్య శిబిరంలో పట్టణానికి దూరంగా ఉన్నారు. రహస్య శిబిరానికి వెళ్లే ముందు టీడీపీ నేత, మాజీ మంత్రి ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగారావు నివాసానికి వెళ్లి ఆయనను కలుసుకొని, మంతనాలు జరిపిన తరువాత రహస్య శిబిరానికి తరలివెళ్లినట్లు తెలిసింది.
- చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన తరువాత టీడీపీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక వైస్‌చైర్మన్‌పై అవివాశ్వాస తీర్మానం పెట్టాలన్న డిమాండ్ రెండు పార్టీల్టో గట్టిగా వినిపిస్తోంది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు రెండింటిపైనా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైస్ చైర్మన్‌పై ప్రస్తుతానికి ఎటువంటి అవిశ్వాసం నోటీసు ఇవ్వలేదు. వైస్‌చైర్మన్ పదవిపై టీడీపీ, వైసీపీలకు చెందిన కౌన్సిలర్లు ఆశలు పెట్టుకొని తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చైర్మన్ పదవి వచ్చేలా సహకరిస్తున్నందున వైస్ చైర్మన్ పదవిని వైసీపీ నుంచి ఎన్నికైన కౌన్సిలర్లకు ఇవ్వాలని రెండు పార్టీల శిబిరాల్లో చర్చించుకుంటున్నారు.