మానవతా దృక్పథంతో కేసులు పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:07 AM
న్యాయస్థానా ల్లో ఉన్న కేసులను మానవతా దృక్పథంతో పరిశీలించి, ఉభయ పార్టీల ద్వారానే పరిష్కారం రాబట్టాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి సాయికల్యాణ చక్రవర్తి అన్నారు.

-పెండింగ్ భారాన్ని తగ్గించాలి
- జిల్లా ప్రధాన న్యాయాధికారి సాయి కల్యాణచక్రవర్తి
విజయనగరం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): న్యాయస్థానా ల్లో ఉన్న కేసులను మానవతా దృక్పథంతో పరిశీలించి, ఉభయ పార్టీల ద్వారానే పరిష్కారం రాబట్టాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి సాయికల్యాణ చక్రవర్తి అన్నారు. జిల్లా కోర్టులోని సమావేశ మందిరంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై మధ్యవర్తిత్వం ద్వారా కేసులను తొందరగా పరిశీలించి పెండింగ్ భారాన్ని తగ్గించాలన్నారు. దీనివల్ల ఉభయ పార్టీలకు సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటుందన్నారు. అలాగే కోర్టులో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు పరిష్కారం దొరుకుతుం దన్నా రు. కేసుల పరిష్కారానికి రాజీ కూడా ఒక మార్గమని అన్నారు. శిక్షణ ఇచ్చిన మాస్టర్ ట్రైనీలు షేక్ మహ్మాద్ షీరాజ్, ఆర్.రత్నతారను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బీహెచ్‌వీ లక్ష్మీకుమారి, న్యాయవాదులు పాల్గొన్నారు.