Share News

PISA ‘ పీసా’ అమలు చేయాల్సిందే..

ABN , Publish Date - Mar 25 , 2025 | 11:42 PM

Mandatory Implementation of PISA కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో ఒడిశా రాష్ట్రం సైతం పీసా చట్టాన్ని అమలు చేయాలని ఎగువశెంబి గ్రామ గిరిజనులు డిమాండ్‌ చేశారు. మంగళ వారం కత్తులకొండ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

  PISA  ‘ పీసా’ అమలు చేయాల్సిందే..
ధర్నా చేస్తున్న గిరిజనులు

సాలూరు రూరల్‌, మార్చి 25 ( ఆంధ్రజ్యోతి ): కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో ఒడిశా రాష్ట్రం సైతం పీసా చట్టాన్ని అమలు చేయాలని ఎగువశెంబి గ్రామ గిరిజనులు డిమాండ్‌ చేశారు. మంగళ వారం కత్తులకొండ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎగువశెంబిలోని గిరిజనుల సాగు భూముల్లో ఒడిశా కంచె నిర్మాణం దారుణమన్నారు. వాస్తవంగా పీసా చట్టాన్ని ఇరు రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉందన్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఒడిశా వ్యవహరిస్తోందని తెలిపారు. ఇప్పటికైనా కొఠియా గ్రూప్‌ గ్రామాల సమస్యపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. ఈ నిరసనలో సీపీఎం మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు , ఆదివాసీ నేతలు గెమ్మల జానకీరావు, కోనేటి సుబ్బారావు, తాడంగి చరణ్‌, చిరంజీవి, సన్నం, మర్రి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ నిరసనపై ఒడిశా అధికారులు ఆరా తీశారు. కొఠియా పోలీసులు సైతం పరిశీలించారు. పొట్టంగి తహసీల్దార్‌ దేవేంద్ర దరువా ఒడిశా పోలీసుల నుంచి ధర్నా వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించారు.

Updated Date - Mar 25 , 2025 | 11:42 PM