Share News

heatstroke వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:28 PM

MGNREGS worker dies of heatstroke జియ్యమ్మవలస మండలం డంగభద్రవలస గ్రామానికి చెందిన ఉపాధి కూలీ పల్ల సీతమ్మ (65) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

  heatstroke వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
పని ప్రదేశంలో కుప్పకూలిన సీతమ్మకు సపర్యలు చేస్తున్న కూలీలు

జియ్యమ్మవలస, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండలం డంగభద్రవలస గ్రామానికి చెందిన ఉపాధి కూలీ పల్ల సీతమ్మ (65) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం గ్రామ సమీపంలో ఉన్న సీతమ్మ చెరువులో ఆమె పనులకు వెళ్లింది. భోజనం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు మళ్లీ పనులకు హాజరైంది. అయితే కొద్ది సేపటి తర్వాత కళ్లు తిరుగుతున్నాయని చెప్పి పని ప్రదేశంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే వేతనదారులు చేరుకుని ఆమెకు సపర్యలు చేశారు. జియ్య మ్మవలస పీహెచ్‌సీకి తరలించాలని సిద్ధమయ్యేలోగా ఆమె మృతి చెందిందని తెలుసుకున్నారు. ఆమెకు ఒక్క కుమారుడు ఉన్నాడు. కాగా సీతమ్మ మృతితో డంగభద్రవలస గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామని ఏపీవో వెల్లడించారు.

Updated Date - Apr 07 , 2025 | 11:28 PM