Share News

సాలూరు ఏఎంసీ కార్యవర్గం ఏర్పాటు

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:08 AM

సాలూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ కార్యవర్గాన్ని ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.

సాలూరు ఏఎంసీ కార్యవర్గం ఏర్పాటు
మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): సాలూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ కార్యవర్గాన్ని ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఇప్పటికే వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌గా ముఖీ సూర్యనారాయణను ప్రకటించిన విషయం తెలిసిందే. వైస్‌ చైర్మన్‌గా మక్కువ మండలం దబ్బగెడ్డకు చెందిన మింది సింహాచలంను ఎంపిక చేశారు. సభ్యులుగా సోముల మచ్చ కళావతి, సొండి దేవి, దునారు ఆనంద్‌, రౌతు రామారావు, డొంక అన్నపూర్ణ, అక్కేన రాధ, పుసర్ల నర్సింగరావు, గొంగాడ సరస్వతి, బేటుకూరి రామన్నదొర, కురుమూరు శివకృష్ణ, జగ్గ వెంకటరాజు, అల్లు అప్పయ్యమ్మ, సింకిలి పుష్పలను సభ్యులుగా నామినేట్‌ చేశారు. దీంతో నామినేటెట్‌గా ఎన్నికైన సభ్యులకు, వైస్‌ చైర్మన్‌కు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అభినందనలు తెలిపారు. సాలూరు మార్కెటింగ్‌ కమిటీ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెటింగ్‌ రంగంలో పారదర్శకత, సమర్థత పెంపొందించటంలో ఈ నూతన కమిటీ కీలకంగా పని చేస్తుందని అన్నారు.

విశ్వబ్రాహ్మణ సంఘం సేవలు భేష్‌

సాలూరు నియోజక వర్గంలో విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు భేష్‌ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరులో కొంకివీధి కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన విశ్వబ్రాహ్మణ సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఈసందర్భంంగా ఆమె మాట్లాడు తూ సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలు భవిష్యత్‌ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:08 AM