Elephant గుంపులో గున్న ఏనుగు
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:15 PM
The Mighty Elephant in the Herd పార్వతీపురం డివిజన్‌లో సంచరిస్తున్న గజరాజుల సంఖ్య పెరిగింది. ఇటీవల జన్మించిన గున్న ఏనుగుతో కలిసి వాటి సంఖ్య ఏనిమిదికి చేరింది.

జియ్యమ్మవలస, మార్చి 31(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం డివిజన్‌లో సంచరిస్తున్న గజరాజుల సంఖ్య పెరిగింది. ఇటీవల జన్మించిన గున్న ఏనుగుతో కలిసి వాటి సంఖ్య ఏనిమిదికి చేరింది. కాగా ఐదు రోజుల కిందట జన్మించిన గున్న ఏనుగుకు జూనియర్ హరి అని అటవీ శాఖాధి కారులు నామకరణం చేశారు. దానిని చూసేందుకు ఎవరూ వెళ్లొద్దని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఏనుగుల గుంపు కన్నపుదొరవలస పంచాయతీ పరిధిలో సంచరిస్తుండడంతో ఆ ప్రాంతవాసులను అప్రమత్తం చేశారు. గత కొద్ది నెలలుగా కనిపించకుండా పోయిన ఒంటరి ఏనుగు ఒడిశాకు వెళ్లిపోయిందని చెబుతున్నారు. కాగా భామినిలో ప్రాంతంలో నాలుగు గజరాజులు సంచరిస్తుండగా జిల్లాలో మొత్తం ఏనుగుల సంఖ్య 12కు చేరింది.