ఘనంగా ఉగాది వేడుకలు
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:49 PM
బాడంగి మండలం గజరాయునివలస గ్రా మానికి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా తె లుగు ప్రజలంతా ఒకేసారి ఉగాది పండుగను నిర్వహిస్తారు.

బొబ్బిలి/బాడంగి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): బాడంగి మండలం గజరాయునివలస గ్రా మానికి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా తె లుగు ప్రజలంతా ఒకేసారి ఉగాది పండుగను నిర్వహిస్తారు. కానీ ఆ ఊరు అందుకు భిన్నం. ఉగాది పండగ వెళ్లిన కొన్ని రోజుల తరువాత... నిర్ణీత ముహూర్తం ప్రకారం కొత్త సంవత్సర వేడుకలు నిర్వహిస్తారు. ఇదే క్రమంలో ఈ ఏడాది ఉగాది వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మార్చి 30న ఉగాది పర్వదినం రోజున గజరాయుని వలస శ్రీరామ మందిరంలో నిర్వహించిన పంచాంగ పఠన కార్యక్రమంలో ఏరువాక ముహూర్తాన్ని పురోహితుడు క్రాలేటి రామ కృష్ణ శర్మ నిర్ణయించారు. దీనినే కొత్త సంవ త్సరంగా భావిస్తారు. ఈమేరకు గురువారం వేకువజామున 4.38 గంటలకు ఏరువాకకు ముహూర్తం పెట్టారు. ఆ సమయానికి రైతులు, కుటుంబంలోని మహిళలతో కలసి నాగలికి, కాడెడ్లకు ప్రత్యేక పూజలు చేశారు. తమ పొలాల్లో దుక్కి దున్ని, పశువుల గెత్తం చల్లారు. అక్కడి నుంచి వచ్చిన తరువాత గోమాతలకు పూజలు చేసి... ఆలయాలకు వెళ్లారు. అనంతరం ఇంటి ఆడపడుచులు, అల్లుళ్లు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి విందు భోజనాలు చేశారు. పొలాలు దున్న డానికి, నాటుబళ్లు లాగడానికి గతంలో ఉన్న మాదిరిగా ఇప్పుడు పశువులు పెద్దగా కని పించడం లేదు. ట్రాక్టర్ల ద్వారానే దుక్కిదున్ను తున్నారు. ఏరువాక ముహూర్తం కోసం తయారు చేయించిన నాగలికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, మామిడి తోరణాలు కట్టి పూజలు చే యడం విశేషం. ఉగాది పర్వదినాన పండితు లు నిర్ణయించిన ఏరువాక ముహూర్తాన్నే తామంతా ఉగాదిగా పరిగణిస్తామని స్థానికులు చెబుతున్నారు. పూర్వీకుల నుంచీ ఇదే ఆచారం కొనసాగుతోందని అంటున్నారు.