Share News

రహదారి విస్తరణ పనులతో గ్రామాలకు రాకపోకలు బంద్‌

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:10 AM

మండల పరిధిలో 165జాతీయ రహదారి విస్తరణ పను ల్లో భాగంగా చేపట్టిన రోడ్డు పనులతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

రహదారి విస్తరణ పనులతో గ్రామాలకు రాకపోకలు బంద్‌
రాకపోకలు నిలుపుదలపై మండిపడుతున్న ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామ్‌ ప్రసాద్‌

మండవల్లి గ్రామస్థుల ఆగ్రహం

మండవల్లి మార్చి 19(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో 165జాతీయ రహదారి విస్తరణ పను ల్లో భాగంగా చేపట్టిన రోడ్డు పనులతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పనుల తీరుపై మండవల్లి గ్రామస్థులు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నుంచి మండవల్లి మీదుగా ఇంగిలిపాకలంక వెళ్లే రోడ్డు వద్ద డ్రెయినేజీ నిర్మాణ పనుల నిమిత్తం రాకపోకలు నిలిపివేశారు. డ్రెయినేజీ తవ్వకం పనులుకూడా చేపట్టారు. జాతీయ రహదారి నుంచి కైకలూరు సందుగా పిలువబడే రోడ్డులో లంక, మండవల్లి గ్రామస్థులు రాకపోకలు సాగిస్తున్నారు. బుధవారం అకస్మా త్తుగా కైకలూరు సందుగా పిలువబడే రోడ్డును నిర్మాణ పనుల నిమిత్తం తవ్వకం చేయడంతో లంక గామ్రాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామంలో కనీసం కారు, ఆటోలు వెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితి ఏర్పడడంతో గ్రామస్థులు ఒక్కసారిగా మండిప డ్డారు. మండవల్లి ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామ్‌ దుర్గాప్రసాద్‌, పలువురు గ్రామస్థులు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్ట్‌ సిబ్బం దిపై మండిపడ్డారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో కైకలూరు సందు రోడ్డు నిర్మాణ పనుల వద్దకు చేరుకొని కాంట్రాక్టు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం చేశారు. రోడ్డు ఇష్టం వచ్చినట్లు రహదారులు లేకుండా నిర్లక్ష్యంగా పనులు చేయడం ఎలా అంటూ పెద్దిరెడ్డి ప్రశ్నించారు.

ఇదే రోడ్డులో ఆక్వా, చేపలచెరువులో ఉండడం వల్ల మేతలు మందులుతో పాటు ప్రజలు రాకపోకలు సాగించవలసి ఉందని ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గ్రామంలోకి వెళ్లేందుకు వీలు లేకుండా రహదా రులు పూర్తిగా నిలిపివేయడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే ఒక రోడ్డును పునఃరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. దీంతో కాంట్రాక్టు సిబ్బంది సుమక్తత వ్యక్తం చేయడంతో శాంతించారు. తక్షణమే ఒక రోడ్డు తర్వాత మరో రోడ్డు రాకపోకలు నిలుపుదల చేసుకోమని పెద్దిరెడ్డి చెప్పారు.

Updated Date - Mar 20 , 2025 | 12:10 AM