బెదిరించి.. ప్రాణం తీశాడు
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:20 AM
మహిళను బలవంతంగా లోబరుచుకుని వివాహేతర సంబంధం కొనసాగించాడు.

మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఫొటోలు, వీడియోలు
చనిపోదామంటూ రెండు సార్లు పురుగు మందు తాగించిన యువకుడు
మహిళ మృతి.. కారకుడిని శిక్షించాలంటూ బంధువుల ఆందోళన
జంగారెడ్డిగూడెం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మహిళను బలవంతంగా లోబరుచుకుని వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఆమెతో ఏకాంతంగా గడిపిన ఫొటోలు, వీడియోలు తీశాడు. తన మాట వినకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు. తర్వాత ఇద్దరం చనిపోదామంటూ పురుగు మందు తెచ్చాడు. ఆమెతో పురుగుమందు తాగించి పారిపోయాడు. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. కొయ్యలగూ డెం మండలం యర్రంపేటకు చెందిన దార్ల హేమదుర్గ ప్రసన్న (31) మృతదేహంతో ఆమె మృతికి కారణమైన యువకుడి ఇంటి వద్ద బంధువులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. మృతురాలి తండ్రి ఈశ్వరాచారి ఫిర్యాదుతో జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ ఎస్‌కే.జబీర్ కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం..
జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామానికి చెందిన గెడ్డం ఈశ్వరాచారి కుమార్తె హేమదుర్గకు 2014 లో కొయ్యలగూడెం మండలం యర్రంపేట గ్రామానికి చెందిన దార్ల రాంప్రసాద్‌తో వివాహమైంది. ఆమెకు ఇద్దరు సంతానం. ఈ నేపథ్యంలో కొయ్యలగూడెం మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన మోదుగ పెద్దసాయి ఆమె వెంటపడి బలవంతంగా లోబరుచుకు న్నాడు. ఇద్దరూ ఏకాంతంగా గడిపిన ఫోటోలు, వీడియో లు సెల్‌ఫోన్‌లో తీసి తన మాట వినకపోతే సోషల్ మీడియాలో పెట్టి పరువుతీస్తానని ఆమెను బెదిరించా డు. ఫిబ్రవరి 7న యర్రంపేటలోని హేమదుర్గ ఇంటికి వెళ్లిన పెద్దసాయి ఇద్దరం కలిసి పురుగుమందు తాగి చనిపోదామని చెప్పి ఆమెతో పురుగుమందు తాగిం చాడు. గమనించిన స్థానికులు ఆమెను కొయ్యలగూడెం ఆసుపత్రిలో చేర్పించగా వారం రోజలు చికిత్స అనంత రం ఆమె పేరంపేటలోని తండ్రి ఇంటి వద్ద ఉంటుంది. 15 రోజల తర్వాత పేరంపేటలో ఉంటున్న మహిళ వద్దకు మోదుగ పెద్దసాయి వచ్చి గొడవ పెట్టుకుని వెళ్లాడు. మరోసారి ఈ నెల 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెద్దసాయి పురుగు మందు డబ్బా తీసుకు వచ్చి ఇద్దరం చనిపోదామని ఆమెను ప్రేరేపించాడు. ఆమె నొప్పితో కేకలు వేయడంతో పెద్ద సాయి పారి పోయాడు. వెంటనే బంధువులు, స్థానికులు జంగారెడ్డి గూడెం పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. దీనితో మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై జబీర్ తెలిపారు.
మృతదేహంతో నిరసన
వివాహేతర సంబంధం పెట్టుకుని, మహిళను పురుగుమందు తాగేలా ప్రేరేపించి ఆమె మృతికి కార ణమైన మోదుగ పెద్దసాయి ఇంటివద్ద మృతదేహంతో ఆమె కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆమె మృతికి కారణమైన పెద్దసాయిని అరెస్టు చేసి శిక్షించా లని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని యర్రంపేట తీసుకువెళ్లారు. యర్రంపేట నుంచి గంగ న్నగూడెం మృతదేహంతో ధర్నా నిర్వహిస్తారని తెలుసుకున్న కొయ్యలగూడెం పోలీసులు అడ్డుకు న్నా రు. దీంతో మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై గంగన్న గూడెం తీసుకువెళ్లి ఆందోళన చేపట్టారు. రాత్రి 11 గంటల వరకు ఆందోళన కొనసాగింది.