Share News

YCP Land Scam: భూదందాలో బాస్‌లు

ABN , Publish Date - Apr 01 , 2025 | 04:21 AM

వైసీపీ హయాంలో ఫ్రీహోల్డ్‌ అధికారం దుర్వినియోగంతో 13.59 లక్షల ఎకరాల భూములు అక్రమంగా మారాయి. రెవెన్యూ విచారణలో చట్ట ఉల్లంఘనలతో కీలక ఐఏఎస్‌ అధికారులు సంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది

YCP Land Scam: భూదందాలో బాస్‌లు

  • అసైన్డ్‌ చట్టాన్ని కాపాడాల్సిన ఐఏఎ్‌సలే నాడు అడ్డగోలుగా దోచిపెట్టారు

  • వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారు

  • ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టారు

  • పీవోటీ చట్టం, జీవో 596ల ఉల్లంఘన

  • ఏడు నెలల్లోనే 13,59,805 ఎకరాలకు ‘విముక్తి’

  • 5,74,306 ఎకరాల్లో ఉల్లంఘనల గుర్తింపు

  • ఇందులో రికార్డుల్లోనే లేని 2.64 లక్షల ఎకరాలు

  • 13 జిల్లాల్లో అక్రమాలు.. టా్‌పలో 4 సీమ జిల్లాలు

  • లోతైన విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు

  • ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ సిఫారసు

జిల్లాల్లో అసైన్డ్‌ చట్టాన్ని కాపాడాల్సినవారే అడ్డగోలుగా వ్యవహరించారు. ఫ్రీహోల్డ్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షలాది ఎకరాల భూములను నాడు వైసీపీ పెద్దలకు దోచిపెట్టారు. వైసీపీ ప్రభుత్వ చివరి ఏడునెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా 13,59,805 ఎకరాల భూములను జిల్లా కలెక్టర్లు ఫ్రీ హోల్డ్‌ చేశారు. ఇందులో 5,74,306 ఎకరాలకు చట్టాలను ఉల్లంఘించి మరీ , జిల్లాల్లో కీలక పోస్టుల్లోని కొందరు ఐఏఎస్‌ అధికారులు నిషేధ విముక్తి కల్పించారని రెవెన్యూ విచారణలో తేలింది. ఇందులో 2.64 లక్షల ఎకరాలకు అసలు రెవెన్యూ రికార్డులే లేకపోవడం గమనార్హం. ఇందులో ఏదో గ్యాంబ్లింగ్‌ జరిగి ఉండొచ్చని, లోతైన విచారణ చేస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయంటూ రెవెన్యూశాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ అండ్‌ కో పెట్టిన భయమో, మరేమో తెలియదుగానీ, గత ప్రభుత్వంలో కొందరు అధికారుల భూ అక్రమాలు శ్రుతి మించి సాగాయి. నాడు నేతలు కోరుకున్న భూములను అసైన్డ్‌ కింద చూపించి ఫ్రీ హోల్డ్‌ చేశారు. రికార్డులే లేని భూములను సైతం అసైన్డ్‌ కోటాలో నిషేధం నుంచి విడిపించారు. అసైన్డ్‌ చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే నేతల కొమ్ముకాసి విలువైన భూములకు స్వేచ్ఛ కల్పించారు.. ఇది ఎవరో చెబుతున్న మాట కానేకాదు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వ హయాంలో భూముల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిన రెవెన్యూశాఖ తాజాగా సర్కారుకు అందించిన నివేదికలో పేర్కొన్న వాస్తవాలివి.


తహసీల్ధార్‌ స్థాయి నుంచి జిల్లాకు సూపర్‌బా్‌సలు గా ఉన్న ఐఏఎ్‌సల వరకు కొందరు ఈ భూ అక్రమాల్లో తిలాపాపం తలాపిడికడు చందంగా పాత్రను పోషించారని రెవెన్యూశాఖ నిగ్గుతేల్చింది. గత జగన్‌ ప్రభుత్వ హయాంలో చివరి ఏడునెలల కాలంలో అసైన్డ్‌ భూములపై రైతులకు హక్కులు ఇచ్చేందుకు తీసుకొచ్చిన ఫ్రీ హోల్డ్‌ విధానంలో భారీగా అక్రమాలు జరిగిన విషయాన్ని రెవెన్యూశాఖ ఇటీవలే బయటపెట్టిన సంగతి తెలిసిందే. లోతైన విచారణ చేయగా, జగన్‌ ప్రభుత్వంలోని ఆరుగురు మంత్రులు, తహసీల్దార్‌, ఆర్‌డీల పాత్ర బయటపడింది. ఇదేకాదు, ఆనాడు జిల్లాకు సూపర్‌బా్‌సలుగా పనిచేసిన కొందరు ఐఏఎ్‌సల పాత్రపైనా స్పష్టమైన ఆధారాలు బయటకొచ్చాయి. వైసీపీ నేత ల రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వేలాది ఎకరాల అసై న్డ్‌, ప్రభుత్వ భూములు పరాధీనం కావడంలో వారి వైఫల్యం, ఉద్దేశపూర్వక తప్పులు ఉన్నాయని రెవెన్యూశాఖ సర్కారుకు పంపిన నివేదికలో పేర్కొంది.

కంచే చేను మేసింది..

రాష్ట్రంలో అసైన్డ్‌, ఇనాం, చుక్కల భూమి, షరతుగల పట్టా భూముల విషయంలో ప్రతి జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలో గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయి. అందులో 13 జిల్లాల పరిధిలో భారీగా అక్రమాలు చోటుచేసుకోగా, అందులో నాలుగు జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఊహించని అక్రమాలతో శ్రీ సత్యసాయి జిల్లా టాప్‌లో నిలవగా, దాని తర్వాతి స్థానం అన్నమయ్య జిల్లాదే. చిత్తూరు, తిరుపతి ఆ తర్వాతి వరసలో ఉన్నాయి. ఏతావాతా రాయలసీమలోనే అసైన్డ్‌ అక్రమాలు కోకొల్లలుగా చోటుచేసుకోవడం గమనార్హం. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని కొన్ని డివిజన్లు, మండలాల్లో కూడా అక్రమంగా భూములను ఫ్రీ హోల్డ్‌ చేశారు. అయితే, పైన పేర్కొన్న టాప్‌ జిల్లాల్లో మాత్రం అతి భారీగా, లక్షల ఎకరాలను నిషేధ జాబితా నుంచి తొలగించారు. పేదలకు మేలు చేస్తున్నామనే పేరుచెప్పి నాటి వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, నేతలు భూములను దండుకున్నారు. ఇందుకు నాటి ప్రభుత్వంలో జిల్లాల్లో కీలక పోస్టుల్లో సూపర్‌బా్‌సలుగా ఉన్న ఐఏఎస్‌ అధికారుల పాత్ర ఉందని తాజాగా నిర్ధారణ అయింది.ఆంధ్రప్రదేశ్‌ అసైన్‌మెంట్‌ చట్టం(పీఓటీ) -1977, రిజిస్ట్రేషన్‌ చట్టం- 1908, భూ ఆక్రమణ చట్టం-1905, చుక్కల భూము ల చట్టం-2017లను అమలు చేయాల్సింది ఆ అధికారులే. అయితే, రాజకీయ నేతల ఒత్తిళ్లు, బెదిరింపులకు తలొగ్గి చట్టాల అమలును నీరుగార్చారని రెవెన్యూశాఖ తేల్చింది.


నిబంధనలకు నీళ్లు..

2023 సెప్టెంబరు నుంచి 2024 మార్చి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,59,805 ఎకరాల భూములను ఫ్రీ హోల్డ్‌ చేశారు. అయితే, ఇందులో 5, 74,306 ఎకరాలు పీవోటీ చట్టానికి విరుద్ధంగా, జీవో 596ను ఉల్లంఘించి నిషేధ విముక్తి కల్పించారని రెవెన్యూ విచారణలో తేలింది. ఇందులో 2.64 లక్షల ఎకరాలకు అసలు రెవెన్యూ రికార్డులే లేవు. అయినా ఆ భూములను అసైన్డ్‌ కోటా కింద లెక్కేసి ఫ్రీ హోల్డ్‌ చేశారని విచారణలో బయటపడింది. కలెక్టర్ల ఉత్తర్వులు లేకుండానే 60వేల ఎకరాలను ఫ్రీ హోల్డ్‌ చేశారు. అంటే ఈ విషయం కలెక్టర్‌లకు తెలిసే జరిగిందా? లేదా? 36వేల ఎకరాలను విస్తీర్ణంతో సంబంధం లేకుండా 22(ఏ) నుంచి తొలగించారు. చట్టంలోని ప్రధాన అంశం 20 ఏళ్లు పూర్తయిన భూములకే ఫ్రీ హోల్డ్‌ కల్పించాలని. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా 38వేల ఎకరాలను, ఆ కండీషన్‌ పరిధిలో లేకున్నా నిషేధ జాబితా నుంచి తొలగించారని తాజా నివేదికలో రెవెన్యూశాఖ పేర్కొంది. అంటే, ఇవన్నీ జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షించడంతోపాటు, పరిశీలించాల్సిన అంశాలు. కలెక్టర్‌ ఉత్తర్వులు లేకుండా 60వేల ఎకరాలను నిషేఽ ద జాబితా నుంచి తొలగిస్తుంటే వారు జిల్లాల్లో ఏం చేసినట్లు? అన్న అనుమానలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూశాఖ నివేదిక ప్రకారం 13 జిల్లాల్లో భారీగా అక్రమాలు జరిగాయి. అందులో 4 జిల్లాల్లో శ్రుతి మించేశారు. సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఫ్రీ హోల్డ్‌ భూముల విషయంలో అధికారులు కళ్లు మూసుకున్నారా? వైసీపీ నేతలకు రాసిచ్చేశారా? అన్నట్లుగా అక్రమాలున్నాయి.


కలెక్టర్లది బాధ్యత కాదా?

ఫ్రీ హోల్డ్‌ చేసే ప్రతి అసైన్డ్‌ భూమికీ రికార్డు పక్కాగా ఉండాలి. భూమి పొందిన లబ్ధిదారు(అసైనీ) పొజిషన్‌లో ఉండాలి. ఆ భూమి 20 ఏళ్ల క్రిత మే అసైన్‌మెంట్‌ చేసి ఉంటే చట్టప్రకారం ఫ్రీ హోల్డ్‌ కు అర్హత ఉన్నట్లు. నిషేధ భూముల జాబితా 22 (ఏ) అమలు, పర్యవేక్షణ బాధ్యతలు జిల్లాలో ఐఏఎ్‌సలకే ఉన్నాయి. దీనిపై రెవెన్యూశాఖ 2023 డిసెంబరులో జీవో 596 జారీ చేసింది. అందులోనూ జిల్లా స్థాయిలో కీలక పోస్టుల్లో ఉన్న ఐఏఎ్‌సలకే అధికారాలు కట్టబెట్టారు. నిజానికి, జిల్లా స్థాయిలో భూ ముల అంశంలో కలెక్టర్‌ అంటే జేసీనే. భూములను ఫ్రీ హోల్డ్‌ చేయడంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత వారిదే. కానీ తాజా రెవెన్యూ విచారణలో 2.64 లక్షల ఎకరాల భూమికి రికార్డులు లేకున్నా ఫ్రీ హోల్డ్‌ చేశారు.


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 04:24 AM