Business Growth : రెండేళ్లలో తెలంగాణలో రూ.1,000 కోట్ల టర్నోవర్
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:02 AM
జెర్సీ బ్రాండ్‌తో పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గోద్రెజ్ జెర్సీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో గట్టి పట్టును చేజిక్కించుకునేందుకు రెడీ అవుతోంది.

గోద్రెజ్ జెర్సీ సీఈఓ భూపేంద్ర సూరి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జెర్సీ బ్రాండ్‌తో పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గోద్రెజ్ జెర్సీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో గట్టి పట్టును చేజిక్కించుకునేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా బాదంపాలు, పన్నీర్, పెరుగు ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు గోద్రెజ్ జెర్సీ సీఈఓ భూపేంద్ర సూరి వెల్లడించారు. మార్కెట్ కార్యకలాపాల విస్తరణ, వ్యూహాత్మక పెట్టుబడులు, భాగస్వామ్యాల ద్వారా ఈ ఉత్పత్తుల అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. గోద్రెజ్ జెర్సీ ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో కీలకమైన బ్రాండ్‌గా ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కంపెనీ టర్నోవర్ రూ.660 కోట్లుగా ఉందని 2026-27 నాటికి దీన్ని రూ.1,000 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సూరి తెలిపారు. కాగా విలువ ఆధారిత ఉత్పత్తులపై మరింతగా దృష్టి పెట్టడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరో రూ.1,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు.
గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.1,540 కోట్లుగా ఉండగా అందులో విలువ ఆధారిత ఉత్పత్తుల వాటా దాదాపు 40 శాతం వరకు ఉందన్నారు. కాగా బాదంపాల మార్కెట్లో మరింత పట్టును చేజిక్కించుకునే ఉద్దేశంతో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటిని ప్రచారకర్తగా నియమించుకున్నట్లు సూరి వెల్లడించారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మార్కెట్లో కంపెనీ రోజుకు 2 లక్షల లీటర్ల వరకు పాలను సేకరిస్తోందని తెలిపారు.

జియో బంపర్ ఆఫర్.. రీఛార్జ్ ప్లాన్లతోపాటు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్..

ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..

Vi: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. వీఐ నుంచి నయా రీచార్జ్ ప్లాన్స్

ఆప్షన్ ట్రేడింగ్ అక్కడే కొంప ముంచుతోంది : సెబీ ఛైర్మన్
