FASTag: మార్చి 1, 2025 నుంచి ఫాస్టాగ్ నిలిపివేస్తున్నారా.. కారణమిదేనా..
ABN , Publish Date - Feb 19 , 2025 | 03:40 PM
ఫాస్టాగ్ వినియోగం వల్ల వచ్చిన పలు రకాల సమస్యల వల్ల మార్చి 1, 2025 నుంచి దీనిని నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మార్చి 1 నుంచి కొత్త విధానాన్ని ప్రవేశపెడతామని అంటున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

దేశంలో ప్రస్తుతం ఫాస్టాగ్ (FASTag) గురించి చర్చనీయాంశంగా మారింది. ఇటివల ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్ వచ్చినా కూడా, వినియోగదారులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం 2025 మార్చి 1 నుంచి FASTag వ్యవస్థను నిలిపివేస్తూ, టోల్ పన్నుల వసూళ్ల కోసం కొత్త విధానం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఆటోమేటెడ్ టోల్ రీడింగ్ సిస్టమ్ (ANPR)ను ప్రవేశపెడుతుందని అంటున్నారు. అయితే ఈ కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా ప్రయోజనాలను పొందవచ్చనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
కొత్త విధానం..
ప్రభుత్వం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ (ANPR)ని మార్చి 1, 2025 నుంచి ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దీని ద్వారా వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేసి టోల్ చెల్లింపులను వసూలు చేస్తారు. ఇది చాలా సులభంగా, ఫాస్ట్‌గా, డిజిటల్ విధానంలో జరగనుంది.
ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుంది?
కెమెరా స్కానింగ్: టోల్ ప్లాజా వద్ద హై రిజల్యూషన్ కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేస్తాయి
డేటాబేస్ మ్యాచింగ్: వాహన నంబర్ ప్రభుత్వ డేటాబేస్‌తో అనుసంధానించి, దాని యజమానిని గుర్తిస్తారు.
ఆటోమేటిక్ చెల్లింపు: మీ బ్యాంక్ ఖాతా లేదా UPI, మొబైల్ వాలెట్ ద్వారా టోల్ చెల్లింపు జరుగుతుంది
ప్రవేశం: టోల్ ప్లాజా వద్ద ఆగిపోవడం వంటివి ఉండవు
ఈ విధానం ఇప్పటికే యూరప్, అమెరికాలో వంటి దేశాల్లో అమల్లో ఉంది. దీనిని ఇండియాలో కూడా అమలు చేయాలని భావిస్తున్నారు.
కొత్త టోల్ వ్యవస్థ ప్రయోజనాలు
ఆగకుండా ప్రయాణించడం: టోల్ ప్లాజా వద్ద పొడవైన లైన్ల వంటివి లేకుండా ప్రయాణించవచ్చు
మోసాల నివారణ: నకిలీ FASTagలను ఉపయోగించలేరు
ఖచ్చితమైన చెల్లింపు: దూరాన్ని బట్టి టోల్ చెల్లింపులు ఉంటాయి, అదనపు రుసుములు ఉండవు
నగదు రహిత విధానం: డిజిటల్ లావాదేవీలు జరగడం వల్ల పారదర్శకత పెరుగుతుంది
తక్కువ కాలుష్యం: టోల్ బూత్ వద్ద ట్రాఫిక్ తగ్గడం వల్ల కాలుష్యం కూడా తగ్గుతుంది
దీని కోసం ఏం చేయాలి..
దీనికోసం మీరు కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీ కారు రిజిస్ట్రేషన్ నంబర్ స్వయంచాలకంగా ANPR సిస్టమ్‌కి లింక్ అవుతుంది. కానీ మీరు ఈ క్రింది విషయాలను మాత్రం గుర్తుంచుకోవాలి:
HSRP (High Security Registration Plate): మీ కారుకి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉండాలి
బ్యాంక్ ఖాతా లేదా UPI: మీ కారు రిజిస్ట్రేషన్, ఫోన్ నంబర్‌కు బ్యాంక్ ఖాతా లేదా UPI ఐడీ కనెక్ట్ చేయబడాలి
పాత లైసెన్స్ ప్లేట్: మీ కారుకు పాత లైసెన్స్ ప్లేట్ ఉంటే దాన్ని మార్చుకోవాలి.
ఎందుకు నిలిపివేత..
భారతదేశంలో 2016లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, టోల్ పన్నుల వసూళ్లను సరళీకృతం చేయడానికి FASTag వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థలో కొన్ని సమస్యలు తలెత్తాయి. చాలా ప్రదేశాల్లో FASTag స్కానింగ్ సమస్యలు, దాని వల్ల వాహనాలు ఆగిపోవడం వంటివి వచ్చాయి. కొంత మంది నకిలీ FASTagలను కూడా వినియోగించారు. మరికొంత మందికి అధిక బిల్లులు రావడం, బ్యాలెన్స్ తక్కువగా ఉన్న వాటికి టోల్ బూత్ వద్ద వాహనాలు నిలిపివేయడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News