IT Industry: ఐటీ పరిశ్రమలో మార్పు అవసరం.. క్లయింట్ల టార్గెట్ కూడా..
ABN , Publish Date - Feb 24 , 2025 | 09:00 PM
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత గురించి ప్రముఖ టెక్ సంస్థ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఉద్యోగుల సంఖ్య కాకుండా, వారి ఉత్పాదకతను పెంచడానికి, కొత్త నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (GenAI) సాంకేతికత గురించి ప్రముఖ టెక్ సంస్థ HCLTech చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పాత నమూనాలను మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నమూనాకు సమయం ముగిసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. క్లయింట్ల లక్ష్యం ప్రస్తుత హెడ్‌కౌంట్‌లో సగం మందితో ఆదాయాన్ని రెట్టింపు చేయడమేనని ఆయన అన్నారు. GenAI వంటి సాంకేతికతలు, IP ఇన్ఫ్యూజ్డ్ సొల్యూషన్‌ల రూపంలో అధిక ఉత్పాదకత అవకాశాలను అందిస్తున్నాయన్నారు.
ఈ క్రమంలో కొత్త వ్యాపారాలను సృష్టించడానికి, ఆదాయాలను వర్గీకరించడానికి కూడా మనం మరింత చురుగ్గా ఉండాలని పేర్కొన్నారు. గతంలో చర్చనీయాంశాలుగా ఉన్న క్లౌడ్, డిజిటలైజేషన్ కాకుండా, ప్రస్తుతం ఏఐ చుట్టూ అనేక అంశాలు ప్రాముఖ్యత పొందుతున్నాయన్నారు. ఈ మార్పు ఐటీ సేవల కంపెనీలలో ఆదాయ వృద్ధి, ఉద్యోగుల సంఖ్య విషయంలో మార్పులను సూచిస్తుందన్నారు. ఈ క్రమంలో రాబోయే కొన్ని సంవత్సరాలలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
డిసెంబర్ 2024తో ముగిసిన మూడు నెలల్లో టాప్ ఐదు ఐటీ సంస్థలు 2,587 మంది ఉద్యోగులను తగ్గించాయి. ఇది గత త్రైమాసికంలో 15,000 మంది ఉద్యోగుల అదనపు సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ. కానీ ఈ మార్పు, నైపుణ్యాలను నియమించుకునే విధానంలో కూడా మార్పును సూచిస్తుందన్నారు. మేము ప్రారంభ స్థాయిలో ఎక్కువ మందిని నియమించుకుంటాము. కానీ వారికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. వారి నుంచి అంచనాలు ఎక్కువగా ఉంటాయి. వారికి మరింత శిక్షణ ఇవ్వడంతోపాటు, మరింత మెరుగ్గా పనిచేయించడం వరకు ఉంటాయన్నారు.
HCLTech CEO వ్యాఖ్యలు ప్రస్తుతం మార్పు అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ ఎలా మారబోతోందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతున్నాయని చెప్పవచ్చు. ఈ మార్పులు ఐటీ పరిశ్రమలో కొత్త సాంకేతికతల ప్రవేశంతో, ఉద్యోగులు నైపుణ్యాలను పెంచుకోవాలని కూడా ప్రస్తావించారు. తద్వారా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ఆదాయ వృద్ధిని సాధించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్
OpenAI: ఓపెన్ ఏఐ నుంచి కొత్తగా ఏఐ ఏజెంట్.. దీని స్పెషల్ ఏంటంటే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News