Share News

2047 నాటికి భారత ఫార్మా పరిశ్రమ రూ.43 లక్షల కోట్లకు..

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:43 AM

ప్రపంచానికి జెనరిక్‌ ఔషధాలు అందించడంలో ముందువరుసలో ఉన్న భారత ఫార్మా రంగం భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ), ఇన్నోవేషన్‌పై...

2047 నాటికి భారత ఫార్మా పరిశ్రమ రూ.43 లక్షల కోట్లకు..

ఆర్‌ అండ్‌ డీ, ఇన్నోవేషన్‌ వ్యయాలకు ప్రోత్సాహకాలివ్వాలి.. జీ 20 షెర్పా అమితాబ్‌ కాంత్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రపంచానికి జెనరిక్‌ ఔషధాలు అందించడంలో ముందువరుసలో ఉన్న భారత ఫార్మా రంగం భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ), ఇన్నోవేషన్‌పై అధికంగా పెట్టుబడులు పెట్టాలని జీ 20 షెర్పా అమితాబ్‌ కాంత్‌ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఏషియా సదస్సులో మంగళవారం ప్రధానోపన్యాసం ఇస్తూ ప్రస్తుతం 5,000 కోట్ల డాలర్లున్న (రూ.4.3 లక్షల కోట్లు) భారత ఫార్మా రంగం 2047 నాటికి 50,000 కోట్ల డాలర్లకు (రూ.43 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా అని చెప్పారు. ఫార్మా ఎగుమతులు 2019 నాటికి 1,900 కోట్ల డాలర్లుండగా (రూ.1.63 లక్షల కోట్లు) 2024 నాటికి 2,800 కోట్ల డాలర్లకు (రూ.2.41 లక్షల కోట్లు) చేరాయన్నారు. ఔషధ పరిశోధన, ఉత్పత్తిలో భారతదేశ సామర్థ్యాలేమిటన్నది కొవిడ్‌-19 సమయంలో ప్రపంచానికి తెలిసిందని ఆయన చెప్పారు. ఔషధాల ఉత్పత్తిలో పరిమాణపరంగా మన దేశం ప్రపంచంలో మూడో స్థానంలోను, విలువపరంగా 12వ స్థానంలోను నిలుస్తోందని తెలిపారు. అమెరికాలో వినియోగించే చేసే ప్రతి మూడు ఔషధాల్లో ఒకటి, బ్రిటన్‌లో ప్రతి నాలుగింటిలోనూ ఒకటి భారత్‌లో ఉత్పత్తి అవుతున్నవేనని కాంత్‌ చెప్పారు.


బయోసిమిలర్స్‌కు మంచి అవకాశాలు

ప్రపంచంలో నాన్‌ కమ్యూనికబుల్‌ వ్యాధు లు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మన ఔషధ కంపెనీలు బయోలాజికల్స్‌, బయో సిమిలర్స్‌పై దృష్టి సారించాలని కాంత్‌ సూచించారు. 2030 నాటికి ఈ వ్యాధులు మరింతగా విజృంభిస్తాయన్న అంచనాల నడుమ మన ఫార్మా కంపెనీలకు చక్కని వృద్ధి అవకాశాలున్న ఈ విభాగంపై దృష్టి సారించాలని సూచించారు మన ఫార్మా కంపెనీలు కేవలం తయారీదారులుగా కాకుండా ఇన్నోవేటర్లుగా ఎదగాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. అయితే ఇలాంటి పెట్టుబడుల్లో రిస్క్‌ అధికంగా ఉంటుందంటూ ఇందుకు కంపెనీలు ముందుకు రావాలంటే అభివృద్ధి దశలోని ఔషధాలు, ఆర్‌ అండ్‌ డీ వ్యయాలపై ప్రభుత్వం తగినన్ని ప్రోత్సాహకాలివ్వడం అవసరమని సూచించారు. డిస్కవరీ ఆధారిత ఇన్నోవేషన్‌లో కార్పొరేట్‌ పెట్టుబడులకు జీఎ్‌సటీ మినహాయింపులు కల్పించే విషయం కూడా పరిశీలించాలన్నారు. అలాగే ఈ తరహా ఇన్నోవేషన్‌కు అనుకూల వాతావరణం కల్పించడం కూడా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. నియంత్రణలు మరింతగా సడలించాలని, అనవసరమైన నిబంధనలు రద్దు చేసి తద్వారా నియంత్రణ యంత్రాంగాన్ని పరిశ్రమకు సహాయకారిగా ఉండేలా చూడాలని ఆయన సూచించారు. బయో ఏషియా సదస్సులో ఈ అంశాలన్నింటినీ సమూలంగా చర్చించి తగు సూచనలతో ముందుకు వచ్చినట్టయితే ఇన్నోవేషన్‌కు అనుకూలమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపవచ్చని కాంత్‌ చెప్పారు.


ఇన్నోవేషన్‌లో రిస్క్‌ అధికం

ఇన్నోవేషన్‌ అత్యంత రిస్క్‌తో కూడుకున్న అంశమని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కో చైర్మన్‌ జీవీ ప్రసాద్‌ అన్నారు. 1994లో డ్రగ్‌ డిస్కవరీలో ప్రవేశించిన తాము 30 సంవత్సరాల పాటు శ్రమపడినా ఆశించిన ఫలితాలు సాఽధించలేకపోయామని చెప్పారు. మంగళవారం సాయంత్రం జరిగిన సీఈఓ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇన్నోవేషన్‌ విభాగంలో కంపెనీలు అధికంగా పెట్టుబడులు పెట్టాలంటే ఆ విభాగంతో ముడిపడి ఉన్న రిస్క్‌లకు సంసిద్ధమై నిధులందించే వెంచర్‌ క్యాపిటలిస్టులు రావడం కూడా అవసరమని పేర్కొన్నారు. చైనాతో పోల్చితే మన ఇన్నోవేషన్‌ వ్యవస్థ కూడా చాలా బలహీనంగా ఉన్నదని ప్రసాద్‌ చెప్పారు. కేవలం దశాబ్ది కాలంలో ఇన్నోవేషన్‌లో చైనా ప్రపంచంలో రెండో స్థానానికి ఎదిగిందని ఆయన అన్నారు. చైనా అనుసరిస్తున్న సానుకూల విధానాలే అందుకు కారణమని ప్రసాద్‌ చెప్పారు.


ఇవి కూడా చదవండి:

Amit Shah: 2 రోజుల్లోనే రూ. 30,77,000 కోట్ల పెట్టుబడులు.. కేంద్ర హోమంత్రి అమిత్ షా ప్రశంసలు


Liquor Scam: లిక్కర్ స్కాం వల్ల ప్రభుత్వానికి 2 వేల కోట్లకుపైగా నష్టం..

Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..


Maha Kumbh Mela: శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 26 , 2025 | 05:43 AM