Share News

ఖర్ఖోడాలో మారుతి మూడో ప్లాంట్‌

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:03 AM

హర్యానాలోని ఖర్ఖోడాలో మారుతి సుజుకీ మూడో ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. ఏడాదికి 2.5 లక్షల కార్ల తయారీ సామర్థ్యం గల ఈ ప్లాంట్‌పై రూ.7410 కోట్ల పెట్టుబడికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం...

ఖర్ఖోడాలో మారుతి మూడో ప్లాంట్‌

రూ.7,410 కోట్ల పెట్టుబడికి బోర్డు ఆమోదం

న్యూఢిల్లీ: హర్యానాలోని ఖర్ఖోడాలో మారుతి సుజుకీ మూడో ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. ఏడాదికి 2.5 లక్షల కార్ల తయారీ సామర్థ్యం గల ఈ ప్లాంట్‌పై రూ.7410 కోట్ల పెట్టుబడికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్టు రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సందేశంలో తెలియచేసింది. 2.5 లక్షల ఉత్పత్తి సామర్థ్యం గల మరో ప్లాంట్‌ ఇప్పటికే నిర్మాణంలో ఉన్నట్టు తెలిపింది. ఖర్ఖోడా ప్లాంట్‌ ఏర్పాటుతో కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7.5 లక్షలకు చేరుతుంది. 2029 నాటికి ఈ సామర్థ్యం సాధించగలుగుతామని కంపెనీ వెల్లడించింది. అంతర్గత సమీకరణల ద్వారానే ఈ పెట్టుబడులు సమకూర్చుకుంటామని కంపెనీ తెలిపింది. ఎగుమతి మార్కెట్‌ సహా దేశీయ డిమాండును తీర్చడానికి ఈ ప్లాంట్‌ దోహదపడుతుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 27 , 2025 | 04:03 AM