Share News

3 రోజుల్లో రూ.14 లక్షల కోట్ల లాభం

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:46 AM

ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒకదశలో 267 పాయింట్ల మేర పుంజుకున్నప్పటికీ, చివరికి 147.79 పాయింట్ల లాభంతో...

3 రోజుల్లో రూ.14 లక్షల కోట్ల లాభం

22,900 ఎగువకు నిఫ్టీ

న్యూఢిల్లీ: ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒకదశలో 267 పాయింట్ల మేర పుంజుకున్నప్పటికీ, చివరికి 147.79 పాయింట్ల లాభంతో 75,449.05 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 73.30 పాయింట్ల వృద్ధితో 22,907.60 వద్ద ముగిసింది. కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, కేపిటల్‌ గూడ్స్‌, రియల్టీ షేర్లలో మదుపరులు కొనుగోళ్లు పెంచడంతోపాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మళ్లీ మన మార్కెట్లో పెట్టుబడులు పెడుతుండటం ఇందుకు దోహదపడింది. గడిచిన మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1,620.14 పాయింట్లు (2.19 శాతం) పుంజుకుంది. మూడు రోజుల ర్యాలీలో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.13.82 లక్షల కోట్లు పెరిగి రూ.405.01 లక్షల కోట్లకు (4.68 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌ మళ్లీ రూ.400 లక్షల కోట్ల మైలురాయిని దాటడం దాదాపు నెల రోజుల తర్వాత ఇదే మొదటిసారి.

Updated Date - Mar 20 , 2025 | 04:24 AM