నా ప్రేమను హేళన చేయడంతో హత్య చేశా..
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:21 PM
తన ప్రేమకు అడ్డుచెప్పడం వల్లే ప్రియురాలి తల్లి మైథిలి (60)ని హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. గత సోమవారం ఈస్ట్ ముగప్పేరులోని అపార్టుమెంట్‌లో మైథిలి(Maithili) అనే వృద్ధురాలు హత్యకు గురైంది.

- నిందితుడి వాంగ్మూలం
చెన్నై: తన ప్రేమకు అడ్డుచెప్పడం వల్లే ప్రియురాలి తల్లి మైథిలి (60)ని హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. గత సోమవారం ఈస్ట్ ముగప్పేరులోని అపార్టుమెంట్‌లో మైథిలి(Maithili) అనే వృద్ధురాలు హత్యకు గురైంది. దీనిపె జేజే నగర్ పోలీసులు(JJ Nagar Police) కేసు నమోదు చేసి శ్యామ్ అనే యువకుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడిని విచారించగా పలు విషయాలు వెల్లడించాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hero Vijay: టీవీకేలో అనుబంధ విభాగాలు.. ప్రకటించిన అధ్యక్షుడు విజయ్
మైథిలి కుమార్తె రిత్వికతో కొంతకాలంగా ప్రేమలో ఉన్నా.. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో రిత్వికను ఇంటివద్ద వదిలిపెట్టగా, ఆమె తల్లి చూసి, మందలించింది. ఈ విషయాన్ని రిత్విక తనకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే వెళ్లాను. ఆ సమయంలో రిత్వికను తల్లి మందలిస్తుండటాన్ని చూసి తట్టుకోలేకపోయాను. మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామని, రిత్వికను తిట్టొదని కోరాను. కానీ, మైథిలి వినిపించుకోకుండా, ప్రేమను ఒప్పుకోనంటూ హేళనగా మాట్లాడింది. దీంతో ఆగ్రహంతో ఆమె గొంతు గట్టిగా పట్టుకోవడంతో ఊపిరాడక చనిపోయింది అంటూ పోలీసులకు తెలిపాడు.
ఈవార్తను కూడా చదవండి: Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన
ఈవార్తను కూడా చదవండి: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు
ఈవార్తను కూడా చదవండి: మేడారంలో ఘనంగా మినీ జాతర
ఈవార్తను కూడా చదవండి: సర్వే అంటూ ఇంట్లోకి చొరబడి దోపిడీ
Read Latest Telangana News and National News