స్ఫూర్తి ప్రదాత..
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:27 AM
నీ స్థైర్యానికి నిలువెల్లా వందనం నీ తెగువ స్ఫూర్తి చందనం ఓ సునీతా విలియమ్స్ భూమ్మీద నీ పాద ముద్రలు మోపి స్ఫూర్తి వచనమై వర్ధిల్లు దీప్తి వాక్కువై నినదించు నీ స్పేస్ వాక్ ఘనత అబ్బుర పడుతుంది...

స్ఫూర్తి ప్రదాత..
నీ స్థైర్యానికి నిలువెల్లా వందనం నీ తెగువ స్ఫూర్తి చందనం ఓ సునీతా విలియమ్స్ భూమ్మీద నీ పాద ముద్రలు మోపి స్ఫూర్తి వచనమై వర్ధిల్లు దీప్తి వాక్కువై నినదించు నీ స్పేస్ వాక్ ఘనత అబ్బుర పడుతుంది జనత అంతరిక్ష వ్యోమగామి అందుకోవమ్మా...
ఆత్మీయ సెల్యూట్ సంక్షుభిత సమయాన నీ స్థితప్రజ్ఞత స్థిర విజ్ఞత అనన్యం అమేయం అమోఘం జయహో విలియమ్స్ జయహో మానవ సంకల్ప శక్తికి మణిహారం తొడిగిన సునీతా.... బ్రహ్మరథం పడుతుంది నీకు భవిత... నీ పట్టుదల మాకు అమరం చరిత్ర పుటల్లో నువ్వు కీర్తి శిఖరం ఓ శాస్త్రీయ పరిశోధనా విధాతా రాబోవు తరాలకు స్ఫూర్తి ప్రదాతా జయహో... సునీతా జయహో..!
కటుకోఝ్వల రమేష్
విశ్వ సోదరి.. నవ మాసాల మాతృగర్భంలా అంతరిక్షంలో అలుపెరగక శ్వాస కోశంతో పోరాటం తొమ్మినెలల అకుంఠిత దీక్ష విశ్వానికి ఆత్మవిశ్వాసం అందిస్తూ అంతరిక్ష శాస్త్రానికి ఆభరణమై ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం సునీతా విలియమ్స్ రాకతో పుడమి పునీతం. నిన్ను సూర్యుణ్ణి చూసినట్టు తలెత్తుకొని చూస్తున్నామమ్మా!
ఈతకోట సుబ్బారావు