Share News

Trump: భారత్‌కు డబ్బులు ఎందుకివ్వాలి.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Feb 19 , 2025 | 11:19 AM

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తరువాత ట్రంప్(Donald Trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారత్(India) విషయంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలతో భారత్‌కు ప్రయోజనం కంటే..

Trump: భారత్‌కు డబ్బులు ఎందుకివ్వాలి.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్..
Donald Trump

వాషింగ్టన్ డిసి: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తరువాత ట్రంప్(Donald Trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారత్(India) విషయంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలతో భారత్‌కు ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. భారత్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్‌కు ఎందుకు నిధులివ్వాలని వ్యాఖ్యానించారు. భారత్ వద్ద చాలా డబ్బు ఉందని.. వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్‌ డాలర్లు ఇవ్వాల్సిన అవసరం అమెరికాకు ఏంటి అని ట్రంప్ ప్రశ్నించారు.


అసలేమైంది..

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత.. ప్రభుత్వ వ్యవస్థలో వృధా వ్యయం కట్టడి కోసం ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలో డోజ్(DOGE) వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ విభాగం వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ఫిబ్రవరి 16న జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ పేరు కూడా ఉంది. ఇండియాలో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను అందిస్తోంది. ఈ ఫండ్‌ను డోజ్ రద్దు చేసింది. ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం అవగా.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు.


ట్రంప్ ఏమన్నారంటే..

ఫ్లోరిడాలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. నిధుల రద్దు అంశంపై స్పందించారు. ‘ఇండియాకు మేం ఎందుకు 21 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలి. భారత్ వద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. ఆ దేశంలో విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్‌ను బీట్ చేయలేదు. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఆ దేశానికి ఎందుకు ఇవ్వాలి. భారత ప్రజలు, ఆ దేశ ప్రధాని పట్ల చాలా నాకు గౌరవం ఉంది. కానీ, ఆ దేశ ఓటర్ల సంఖ్యను పెంచేందుకు మేం 21 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలా.. మరి అమెరికాలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది..’’ అని ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.


Also Read:

ఢిల్లీ సీఎం ప్రమాణ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్..

కొత్త సిమ్ కొనబోతున్నారా.. VIP నంబర్ కోసం ఇలా బుక్ చేసుకోండి..

భక్తులకు ఏపీ టూరిజం గుడ్ న్యూస్..

For More International News and Telugu News..

Updated Date - Feb 19 , 2025 | 11:19 AM