Donlad Trump: ట్రంప్ గురించి ఎవరికీ తెలియని 7 సీక్రెట్స్.. ఈ స్థాయికి ఎలా చేరారంటే..
ABN , Publish Date - Jan 20 , 2025 | 01:45 PM
Donlad Trump Oath Ceremony: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. రెండోసారి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఆయన.. ఇక నుంచి వైట్‌హౌస్‌కు బాస్‌గా వ్యవహరించనున్నారు.

అమెరికా ప్రెసిడెంట్‌గా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. సోమవారం మధ్యామ్నం (మన దేశ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలు) అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజధాని నగరం వాషింగ్టన్ డీసీలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రంప్ కూడా తన ఫ్యామిలీతో కలసి ఫ్లోరిడా నుంచి అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ జీవితం గురించి ఎవరికీ తెలియని 7 రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలతో కోట్లకు అధిపతిగా ఉన్న ట్రంప్... అక్కడితో ఆగిపోలేదు. తన ఇమేజ్, క్రేజ్, పాపులారిటీని మరింత పెంచుకునేందుకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ సాయం తీసుకున్నారు.
హాలీవుడ్ ఫిల్మ్ స్టార్స్‌తో కలసి పలు టీవీ షోలు, మూవీస్‌లో సందడి చేస్తూ సాధారణ జనానికి కూడా దగ్గరయ్యారు ట్రంప్.
పాపులర్ షో శాటర్ డే నైట్ లైవ్‌కు ట్రంప్ 2 సార్లు హోస్ట్‌గా వ్యవహరించారు.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు కలిగిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) షోలో ట్రంప్ ఒకమారు పాల్గొన్నారు.
2007లో నిర్వహించిన బ్యాటిల్ ఆఫ్ బిలియనీర్స్ ఈవెంట్‌లో ట్రంప్ పాల్గొనగా.. ఆయన రెజ్లర్లు విజయం సాధించారు.
క్రిస్మస్ క్లాసిక్‌గా నిలిచిన హోమ్ ఎలోన్ 2 (లాస్ట్ ఇన్ న్యూయార్క్ 1992) మూవీలో ట్రంప్ యాక్ట్ చేశారు.
హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నిర్వహించే ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ అనే కామెడీ షోలో ట్రంప్ గెస్ట్‌గా అలరించారు. ఈ షోతో ఆయన పాపులారిటీ విపరీతంగా పెరిగింది.
2001లో విడుదలైన జులాండర్ అనే మరో చిత్రంలోనూ ట్రంప్ మెరిశారు. దీన్ని మలేషియాలో బ్యాన్ చేశారు.
పర్సనల్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకునేందుకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీని ఆయన వాడుకున్న తీరు లీడర్స్‌గా ఎదగాలనుకునే వారికి ఓ పాఠం అని ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు.
సోషల్ మీడియాను విపరీతంగా వాడుతూ యువ ఓటర్లకు ఆయన దగ్గరైన తీరు కూడా రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడంలో దోహదపడిందని అంటుంటారు.
అమెరికా ప్రజల ఎమోషన్స్‌ను అర్థం చేసుకొని వాటి మీదే ప్రచారాన్ని నడిపించడం, లక్ష్యాన్ని చేరుకునేందకు ఎంత సాహసమైనా చేయడానికి వెనకడుగు వేయకపోవడం ఆయన సక్సెస్‌కు మరో కారణమని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
ట్రంప్ ప్రమాణ స్వీకారం.. హాజరయ్యే ధనికులు వీళ్లే..
ఇండియా టైం ప్రకారం ట్రంప్ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి