Sheikh Hasina : మళ్లీ వస్తా..ప్రతీకారం తీర్చుకుంటా
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:27 AM
తాను బంగ్లాదేశ్ తిరిగి వస్తానని, అమరుల తరఫున ప్రతీకారం తీర్చుకుంటానని పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా అన్నారు. మంగళవారం తన పార్టీ అయిన అవామీలీగ్ కార్యకర్తలతో గుర్తు తెలియని ప్రదేశం నుంచి ఆమె

ఢాకా, ఫిబ్రవరి 18: తాను బంగ్లాదేశ్ తిరిగి వస్తానని, అమరుల తరఫున ప్రతీకారం తీర్చుకుంటానని పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా అన్నారు. మంగళవారం తన పార్టీ అయిన అవామీలీగ్ కార్యకర్తలతో గుర్తు తెలియని ప్రదేశం నుంచి ఆమె వర్చువల్ విధానంలో ప్రసంగించారు. 45 నిమిషాల పాటు సాగిన ప్రసంగాన్ని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 8000 మంది వీక్షించారు. ఓపిక పట్టాలని, తాను మళ్లీ తిరిగి వస్తానని చెప్పారు. ప్రతీకారం తీర్చుకొని అందరికీ న్యాయం చేస్తానని చెప్పారు. నోబెల్ పురస్కార గ్రహీత, తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూన్‌సను ఉగ్రవాదిగా అభివర్ణించారు.