Stuff Chicken: మందు తాగేటప్పుడు.. చికెన్ తింటే ఏమవుతోంది
ABN , Publish Date - Mar 27 , 2025 | 08:38 PM
Stuff Chicken: మద్యం తాగే వారు సంఖ్య నానాటికి పెరుగుతోంది. ప్రస్తుతం ఇది ఒక ఫ్యాషన్‌గా మారింది. మద్యం తాగే సమయంలో రకరకాల స్టఫ్ తీసుకొంటూ ఉంటారు. అయితే మద్యం తాగే సమయంలో చికెన్ తినవచ్చా. అంటే.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

అదేంటో కానీ.. ముందు ఫుల్‌గా కొట్టేసి.. దానికి తగ్గట్లు తిన్న వాళ్లకు ఎటువంటి రోగాలు రావు. ఉండవు. ఫుల్‌గా మందుకొట్టి ఏం తినకుండా ఉండే వాళ్లను అన్ని రోగాలు చుట్టుముడతాయి. అయితే మందు కొట్టిన తర్వాత.. స్టఫ్‌లోకి ఏదైనా తీనడం ఆరోగ్య రీత్య ముఖ్యం. అయితే భారతీయుల్లో చాలా మంది మందు కొట్టేటప్పుడు చికెన్ అమితంగా ఇష్టపడతారు. మరి మందు కొట్టే సమయంలో చికెన్ తీసుకోవచ్చా? అంటే..
మందు కొట్టేటప్పుడు చికెన్ తింటే ఏమవుంది?: చికెన్‌లో ప్రోటీన్, కొవ్ అధికంగా ఉంటుంది. ఇవి ఆల్కహాల్ శోషణను (absorption) నెమ్మదిగా తీసుకుంటాయి. అదే ఖాళీ కడుపుతో మందు తాగితే మాత్రం ఆల్కహాల్ వేగంగా రక్తంలోకి చేరి మత్తు త్వరగా ఎక్కుతుంది, కానీ చికెన్ తింటే మాత్రం ఈ ప్రక్రియ కొద్ది పాటి ఆలస్యమవుతుంది. గ్రిల్డ్ లేదా బాయిల్డ్ చికెన్ తింటే కడుపులో గ్యాస్ (acidity) తగ్గుతుంది. అలాగే హ్యాంగోవర్ ప్రమాదం సైతం కొంత మేర తగ్గుతుంది. అయితే, ఫ్రైడ్ చికెన్ లేదా మసాలా అధికంగా ఉన్న చికెన్ తింటే మాత్రం జీర్ణ సమస్యలు, గ్యాస్‌తోపాటు కడుపు నొప్పి రావచ్చు. మందు తాగి ఫ్రైడ్ చికెన్ తిని తీవ్రమైన అసిడిటీతో బాధపడ్డ అనుభవం చాలా మందిలో ఉంటుంది.
అయితే మందు తాగుతూ.. చికెన్ తినడం వల్ల ఇబ్బంది ఎదురు కాదు. కానీ అతిగా తినడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరుగే అవకాశముంది. చికెన్‌లోని కొవ్వు, ఆల్కహాల్ కలిస్తే కాలేయం, జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీర్ఘకాలంలో ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఆల్కహాల్‌తో కొవ్వు ఆహారం తీసుకునేవారిలో 30% మందికి కాలేయ సమస్యలు వచ్చినట్లు ఓ ఆధ్యయనంలో తెలింది. ఈ నేపథ్యంలో చికెన్ తినాలనుకుంటే తక్కువ మసాలా, నూనె లేని గ్రిల్డ్ రూపంలో చికెన్ 100 నుంచి 150 గ్రాములు తీసుకోవడం ఉత్తమం.
ఇక ఆరోగ్యం రీత్యా ఏది ఉత్తమం అంటే.. ఆరోగ్య నిపుణులు ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే తేలికైన ఆహారాన్ని సిఫారసు చేస్తున్నారు. ఉడికించిన గుడ్లు, గ్రీన్ సలాడ్.. అంటే కీరదోస, టొమాటోలతోపాటు బాదం, వాల్‌నట్స్ తీసుకోవాలని చెబుతున్నారు. ఇవి ఆల్కహాల్ శోషణను నియంత్రిస్తాయని.. అలాగే కడుపును రక్షిస్తాయని చెబుతున్నారు. ఇక బాదం, వాల్ నట్స్‌లో ఒమేగా-3 కొవ్వులు కాలేయ ఒత్తిడిని తగ్గిస్తాయని వివరిస్తున్నారు. ఒక గ్లాసు మందుతో 10 నుంచి 15 బాదంలు తింటే హ్యాంగోవర్ దాదాపు 20 శాతం తగ్గుతుందని ఓ ఆరోగ్య నివేదిక స్పష్టం చేసింది. అలాగే పెరుగు లేదా మజ్జిగ తాగడం వల్ల కడుపులో ఎసిడిటిని తగ్గిస్తుంది.
మందు తాగేటప్పుడు అత్యధిక కొవ్వు కలిగిన ఆహారం కంటే.. తేలికైన, పోషకమైన స్టఫ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చికెన్ తినాలనుకుంటే పరిమితంగా, సరైన వంట పద్ధతిలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మందు తాగే సమయంలో వాల్ నట్స్, సలాడ్‌లు తీసుకోవడం ఉత్తమం అని పేర్కొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Top Secret: చనిపోయే ముందు శరీరంలో మొదట ఆగిపోయే అవయవం ఏదింటే..
Iftar Party: ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
KTR: అలా అయితే రాజకీయాలకు గుడ్ బై
Night Food: రాత్రుళ్లు ఈ ఆహారం తీసుకోండి.. షుగర్ రమ్మనా రాదు..
Curd Rice:పెరుగన్నం తింటే లాభమా నష్టమా.. ఎందుకు తినాలి
Milk: పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. డేంజర్
LRS : ఎల్ఎస్ఆర్ లీల.. రూ. 14 లక్షల భూమికి రూ. 28 కోట్ల ఎల్ఆర్ఎస్ ఛార్జెస్..
ఈ పువ్వుతో ఇన్ని లాభాలున్నాయా..?