Parliamentary privileges: కేంద్ర మంత్రి రిజుజుపై సభా హక్కుల నోటీసు
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:33 AM
కాంగ్రెస్ పార్టీ, కిరేన్ రిజిజుపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేసింది. రిజిజు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురించి లోక్‌సభలో అసత్యం చెప్పారు అన్న ఆరోపణలు చేయబడినవి.

న్యూఢిల్లీ, మార్చి 25: సభను తప్పుదోవ పట్టించారన్న ఆరోపణతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజుజుపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశ పెడతామంటూ కాంగ్రెస్ పార్టీ నోటీసు అందజేసింది. కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ మంగళవారం స్పీకర్ ఓం బిర్లాకు నోటీసు అందజేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగాన్ని మార్చుతామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ వ్యాఖానించారంటూ సోమవారం లోక్‌సభలో అసత్యం చెప్పిన రిజుజు సభ్యులను తప్పుదోవపట్టించారని ఆరోపించారు. ఇది సభా హక్కుల ఉల్లంఘనేనని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ