Share News

February 14: శుభలేఖలు పంచుతూ.. మృతు ఒడిలోకి..

ABN , Publish Date - Jan 19 , 2025 | 04:30 PM

February 14: మరికొద్ది రోజుల్లో వివాహం నిశ్చయమైంది. తన పెళ్లి వేడుకలకు బంధు మిత్రులను ఆహ్వానించాలని నిర్ణయించాడు. అందు కోసం బయలుదేరాడు.

February 14: శుభలేఖలు పంచుతూ.. మృతు ఒడిలోకి..
Anil

మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఆ క్రమంలో తన వివాహ వేడుకకు బంధుమిత్రులను ఆహ్వాంచాలని నిర్ణయించాడు. అందులోభాగంగా శుభలేఖలు ఇచ్చి.. వారిని స్వయంగా ఆహ్వానించేందుకు బయలుదేరాడు. అలా వెళ్లిన అతడిని మృత్యువు.. అగ్నిప్రమాదం రూపంలో కబళించింది. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకొంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? గ్రేటర్ నోయిడాలోని నవాడాకు చెందిన అనిల్‌కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 14వ తేదీ అతడి వివాహం.

ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం.. అంటే జనవరి 18వ తేదీ అతడు ఆహ్వాన పత్రికలు తీసుకొని బంధుమిత్రులను ఆహ్వానించేందుకు బయలుదేరాడు. ఆ క్రమంలో ఘాజీపూర్ బాబా బోకే హాల్ సమీపంలో అతడు ప్రయాణిస్తున్న కారు అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ క్రమంలో దాదాపుగా అగ్నికి ఆహుతి అయిన అతడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం.. ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Anil1.jpg

మరోవైపు.. ఆహ్వాన పత్రాలు తీసుకు వెళ్లిన అనిల్‌కు.. కుటుంబ సభ్యులు.. అతడి సెల్‌కు పలుమార్లు ఫోన్ చేశారు. కానీ అతడి నుంచి స్పందన లేదు. దీంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతోన్నారు. అయితే రాత్రి 11.30 గంటలకు పోలీసులు అనిల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో వారంతా కన్నీరుమున్నీరవుతూ.. ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

Also Read: ఢిల్లీ బయలుదేరి వెళ్లిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా


ఇక ఈ ఘటనపై అనిల్ బావ మరదిన యోగేష్ స్పందించారు. తన సోదరితో అనిల్‌కు వివాహం నిశ్చియమైందన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన వారి వివాహాన్ని పెద్దలు నిశ్చయించారని తెలిపారు. అయితే ఈ కారులో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేది తను ఇప్పటికి అంతుబట్టని విషయంగా ఉందన్నారు. ఇక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వివరించారు.


ఇంకోవైపు గత నెలలో ఢిల్లీలోని లజ్‌పత్ నగర్‌లో ఓ కారుకు మంటలంటుకొన్నాయి. కారు పార్కింగ్‌పై ఇరుగు పొరుగు వారి మధ్య వివాదం రేగింది. ఆ క్రమంలో వారి మధ్య తరచూ వాగ్వాదం చోటు చేసుకొనేది. దీంతో ఓ వ్యక్తి పొరుగువారి కారుకు నిప్పు పెట్టాడు. ఈ ఘటనపై కారు యజమాని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాంతో పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులోభాగంగా.. కారుకు నిప్పు పెట్టిన పొరుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అనిల్ కారు అగ్ని ప్రమాదం ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

For National News And Telugu News

Updated Date - Jan 19 , 2025 | 04:30 PM