Share News

Eknath Shinde: సీఎంతో విభేదాలపై ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 18 , 2025 | 03:03 PM

సీఎం ఫడ్నవిస్ నేతృత్వంలో రాష్ట్ర హోం శాఖ ఇటీవల శివసేనకు చెందిన 20 మంది అధికార ఎమ్మెల్యేల 'వై' కేటగిరి భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బీజేపీ, ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేల భద్రతను కూడా తగ్గించనుంది.

Eknath Shinde: సీఎంతో విభేదాలపై ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ (Devendra Fadnavis)కు, ఆయన డిప్యూటీ (Deputy Chief Minister) ఏక్‌నాథ్ షిండేకు మధ్య 'ప్రచ్ఛన్న యుద్ధం' (Cold War) జరుగుతోందా? 20 మంది శివసేన వర్గం ఎమ్మెల్యేల భద్రతను 'వై ప్లస్' క్యాటగిరికి తగ్గించడం, రాయ్‌గఢ్, నాసిక్‌లకు ఇన్‌చార్జుల నియామకంపై షిండే శివసేన అభ్యంతరం తెలవడం వంటి వరుస పరిణామాల నేపథ్యంలో ఇద్దరి మధ్యా వ్యవహారం చెడిందనే ఊహాగానాలు ఉపందుకుంటున్నాయి. దీనిపై ఏక్‌నాథ్ షిండే ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

Supreme Court: రణవీర్ అలహాబాదియాపై ధర్మాసనం సీరియస్


సీఎం, డిప్యూటీ సీఎం మధ్య "కోల్డ్ వార్" నడుస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలపై షిండే స్పందిస్తూ, తమ మధ్య ఎలాంటి ''కోల్డ్ వార్'' లేదన్నారు. ''థండా థండా కూల్ కూల్'' అని నవ్వుతూ సమాధానమిచ్చారు. "ఎలాంటి కోల్డ్ వార్ లేదు. మాదేమీ మహా వికాస్ అఘాడి (విపక్ష కూటమి) కాదు, ఇండి (INDIA) కూటమి కాదు. రాష్ట్ర ప్రగతి కోసం మేము సమష్టిగా పనిచేస్తున్నాం" అని ఏక్‌నాథ్ షిండే వివరణ ఇచ్చారు.


20 మంది ఎమ్మెల్యేల భద్రత కుదింపు

సీఎం ఫడ్నవిస్ నేతృత్వంలో రాష్ట్ర హోం శాఖ ఇటీవల శివసేనకు చెందిన 20 మంది అధికార ఎమ్మెల్యేల 'వై' కేటగిరి భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బీజేపీ, ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేల భద్రతను కూడా తగ్గించనుంది. అయితే షిండే వర్గంతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. గతంలో ఎంవీఏ నుంచి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఈ వై కేటగిరి భద్రత కల్పించగా, రాష్ట్ర వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం ఆ భద్రతను 'వై ప్లస్'కు కుదించింది. దీంతో ఫడ్నవిస్‌కు, షిండేకు మధ్య 'కోల్డ్ వార్' నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Annamalai : ఆలయాలు ఎలా ఉండకూడదో తమిళనాడులో చూడొచ్చు

Bengaluru: బెంగళూరులో తాగు నీటిని ఇతర అవసరాలకు వాడితే భారీ జరిమానా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2025 | 03:03 PM