EC: ఏఐ కంటెంట్‌పై లేబుల్స్ తప్పనిసరి
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:15 AM
రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో కృత్రిమ మేధ(ఏఐ)ను విరివిగా వినియోగిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం(ఈసీ) అప్రమత్తమైంది. ఏఐ సాయంతో రూపొందించిన ఫొటోలు, వీడియోలు, ఆడియో వంటివి ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయని గుర్తించింది.

ఎన్నికల ప్రచారంలో ఏఐ.. పార్టీలకు ఈసీ సూచనలు
న్యూఢిల్లీ, జనవరి 16: రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో కృత్రిమ మేధ(ఏఐ)ను విరివిగా వినియోగిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం(ఈసీ) అప్రమత్తమైంది. ఏఐ సాయంతో రూపొందించిన ఫొటోలు, వీడియోలు, ఆడియో వంటివి ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయని గుర్తించింది. దీంతో ఏఐ వినియోగం అంశంలో రాజకీయ పార్టీలకు పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని పేర్కొంటూ గురువారం పలు సూచనలు చేసింది.
ఏఐ ద్వారా రూపొందించిన ఫొటోలు, వీడియోలు, ఆడియోను ప్రచారంలో వినియోగిస్తే.. ఆ కంటెంట్‌పై ‘ఏఐ జనరేటెడ్/డిజిటల్లీ ఎన్‌హ్యాన్స్‌డ్/ సింథటిక్ కంటెంట్’ అనే లేబుల్స్‌ను కనిపించేలా తప్పనిసరిగా ముద్రించాలని రాజకీయ పార్టీలను ఈసీ ఆదేశించింది. అంతేకాక, ఏఐ సాయంతో రూపొందించిన కంటెంట్‌తో ప్రకటనలు ఇచ్చేటప్పుడు.. ముందుగా హెచ్చరికలు వెయ్యాలని సూచించింది. ఈ మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఓ అడ్వయిజరీ పంపింది.