Share News

CM Nitish Kumar: అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..

ABN , Publish Date - Mar 20 , 2025 | 04:05 PM

CM Nitish Kumar: వివిధ సభా వేదికలపై బిహార్ సీఎం నితీష్ కుమార్.. విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన అలాగే ప్రవర్తించారు. దీంతో సీఎం నితీష్ కుమార్‌పై ఆర్జేడీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అగ్రనేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు.

 CM Nitish Kumar: అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..
BIhar CM Nitish Kumar

పాట్నా, మార్చి 20: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవల తన విపరీత ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి బిహార్ సీఎం నితీష్ కుమార్ వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఏమైందంటే.. బిహార్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్నాయి. ఆ క్రమంలో గురువారం రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) సభ్యుడు సుగయ్ యాదవ్.. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సెల్ ఫోన్ చూస్తూ.. ప్రజా పంపిణి వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలను ఆయన అడుగుతున్నారు. సభలో సభ్యుడు సెల్ ఫోన్‌ను వినియోగించడాన్ని గమనించిన సీఎం నితీష్ కుమార్‌ ఆగ్రహం కట్టలు తెంచుకొంది.

సభలో సభ్యుడు మొబైల్ వాడడంపై ఆయన తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. సభలోకి మొబైల్ తీసుకు రాకుడదనే నిబంధన ఉందని ఈ సందర్భంగా సీఎం నితీష్ కుమార్ గుర్తు చేశారు. సభలోకి సభ్యులు ఎవరు మొబైల్ తీసుకు రాకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆయన కోరారు. గత పదేళ్లలో సెల్ ఫోన్ వాడకం బాగా పెరిగిందన్నారు. సెల్ ఫోన్ ఇలా వినియోగిస్తే.. భూమి త్వరలో నాశనం అవుతుందన్నారు. సభకు ఎవరైనా మొబైల్ తీసుకు వస్తే.. నిర్థాక్షణ్యంగా వాటిని బయట పడేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు సీఎం నితీష్ కుమార్ సూచించారు.


ఇక ఈ అంశంపై ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా స్పందించారు. మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల ప్రపంచం 10 సంవత్సరాల్లో నాశనం అవుతుందని సీఎం నితీష్ కుమార్ చెబుతున్నారన్నారు. అయితే పర్యావరణ పరి రక్షణ కోసం.. అసెంబ్లీని కాగిత రహితంగా ప్రభుత్వం మార్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సభలో సభ్యులు అడిగే ప్రశ్నలు.. వాటికి సమాధానాలు ఇవ్వాలంటే.. సెల్ ఫోన్ లేదా ట్యాబ్ వినియోగించాల్సి ఉందన్నారు.


కానీ కంప్యూటర్ అంటే తెలియని బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు.. సెల్ ఫోన్‌ సైతం సమస్యగా మారిందని వ్యంగ్యంగా అన్నారు. బిహార్‌కు టెక్నాలజీ వ్యతిరేకి, యువత, విద్యార్థులు, మహిళలకు వ్యతిరేకి అయిన సంప్రదాయవాది అయిన ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరమని తేజస్వీ యాదవ్ అభివర్ణించారు. సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలను తేజస్వీ యాదవ్ ఖండించారు.

Also Read:

Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం

పోలీసుల విచారణకు విష్ణుప్రియ... మొబైల్ సీజ్

అందుకేమరి.. కాస్త చూసుకొని మాట్లాడాలనేది.. ఏం

సంజూ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్

For National News And Telugu News

Updated Date - Mar 20 , 2025 | 04:08 PM