Former CM: అన్నాడీఎంకే సమన్వయకర్తను నేనే..
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:22 PM
అన్నాడీఎంకే(AIADMK) 2021లో చేసిన తీర్మానం ప్రకారం, సమన్వయకర్తగా తానే కొనసాగుతున్నానని, అందువల్ల పార్టీని తనకే అప్పగించాలని, రెండాకుల చిహ్నాం ఎడప్పాడి పళనిస్వామి వినియోగించడంపై నిషేధం విధించాలని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.
- కేసు విచారణలో ఉన్నందున పార్టీ నాకే అప్పగించండి
- ఈసీకి తెలిపిన ఓపీఎస్
చెన్నై: అన్నాడీఎంకే(AIADMK) 2021లో చేసిన తీర్మానం ప్రకారం, సమన్వయకర్తగా తానే కొనసాగుతున్నానని, అందువల్ల పార్టీని తనకే అప్పగించాలని, రెండాకుల చిహ్నాం ఎడప్పాడి పళనిస్వామి వినియోగించడంపై నిషేధం విధించాలని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఈసీ ముందు తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: విజయ్ పార్టీతో డీఎంకే కూటమికి నష్టం లేదు
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం పార్టీలో తలెత్తిన విభేదాల కారణంగా ఒ.పన్నీర్‌సెల్వం బృందం పార్టీకి దూరం కాగా, అనంతరం జరిగిన పరిణామాల్లో ఆయన పార్టీలో విలనమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో పన్నీర్‌సెల్వం సమన్వయకర్తగా, పళనిస్వామి ఉప సమన్వయకర్తగా ఎంపికయ్యారు. అలాగే, ముఖ్యమంత్రిగా ఎడప్పాడి కొనసాగేలా పార్టీ నిర్ణయం తీసుకుంది. అనంతరం జరిగిన ఎన్నికల్లో పార్టీ పరాజయం కావడంతో, మళ్లీ పార్టీలో లుకలుకలు చోటుచేసుకున్నాయి. ఒ.పన్నీర్‌సెల్వం(O. Panneerselvam), ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి తొలగించి, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామిని ఎంపిక చేశారు.
ప్రస్తుతం పార్టీ, చిహ్నం ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. దీనిని సవాల్ చేస్తూ పన్నీర్‌సెల్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేఫథ్యంలో, ఎన్నికల సంఘం అన్నాడీఎంకేకు రెండాకుల చిహ్నం కేటాయించడంపై నిషేధం విధించాలని కోరుతూ దిండుగల్‌కు చెందిన సూర్యమూర్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం, ఎన్నికల సంఘం 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది. అనంతరం గత నెల 23, 24 తేదీల్లో పళనిస్వామి, పుహళేంది, న్యాయవాది రామ్‌కుమార్ ఆదిత్యన్, సూర్యమూర్తి తదితరుల తరఫున ఎన్నికల సంఘంలో వినతిపత్రాలు సమర్పించారు.
ఓపీఎస్ బదులు పిటిషన్...
రెండాకుల చిహ్నం కేటాయింపుపై ఒ.పన్నీర్‌సెల్వం ఎన్నికల సంఘానికి సమర్పించిన వినతిపత్రంలో... 2021 తీర్మానం ప్రకారం, ప్రస్తుతం పార్టీ సమన్వయకర్తగా తాను వ్యవహరిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో విచారణలో ఉన్నందున, పళనిస్వామికి పార్టీ, చిహ్నాన్ని అప్పగించిన ఎన్నికల సంఘం, తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఓపీఎస్ పేర్కొన్నారు.
ఇల్లు మారే ఆలోచనలో ఓపీఎస్!
స్థానిక గ్రీమ్స్ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ప్లాట్ అద్దెకు తీసుకుని వున్న ఓపీఎస్.. జ్యోతిష్యుల సూచన మేరకు ఇల్లు మారే యోచనలో వున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు ఆయన రాజకీయంగా బలహీనపడుతుండడం, ఆయన ప్రత్యర్థి ఈపీఎ్‌సకు పార్టీ, చిహ్నం కేటాయించడం తదితరాలు ఓపీఎస్‌ను ఆలోచనలో పడేశాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ(BJP) మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించి, మళ్లీ పార్టీ తన చేతుల్లోకి తీసుకోవాలని ఓపీఎస్ భావించినా, ఆయన ఘోరపరాజయంతో దానికి ఫుల్‌స్టాప్ పడింది. ఈ నేఫథ్యంలో, ప్రస్తుత ఉంటున్న ఇల్లు మారిస్తే మంచిదని ఓ జ్యోతిష్యుడు ఓపీఎ్‌సకు సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో, మరో ఇంటికి మారడంపై ఓపీఎస్ తన సహచరులతో చర్చించినట్లు తెలిసింది.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్.. శామీర్‌పేటకు మెట్రో!
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు
ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...
Read Latest Telangana News and National News