Republic Day: మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో త్రివర్ణ పతాకం ఎగరవేత..
ABN , Publish Date - Jan 26 , 2025 | 11:05 AM
ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 14 మారుమూల ప్రాంతాల్లో తొలిసారిగా జాతీయ జెండా ఎగిరింది. ఆయా ప్రాంతాల్లో భద్రతా బలగాలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశంలో 2026 నాటికి మావోయిస్టులు లేకుండా అంతం చేస్తామని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చిరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని మావోయిస్ట్ ఇలాకా (Maoist aAreas)లో త్రివర్ణ పతాకం (Tricolor Flag) రెపరెపలాడింది. బస్తర్‌లో భద్రతా శిబిరాన్ని ప్రారంభించిన తర్వాత, నక్సల్‌ఘర్‌లోని 14 ప్రదేశాలలో (14 Places) భద్రతా బలగాలు జాతీయ పతాకాన్ని (National Flag) ఎగరవేశారు. బీజాపూర్, నారాయణపూర్, ఇంకా సుక్మా జిల్లాల ప్రాంతాలలో త్రివర్ణ పతాకం రెపరేపలాడింది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు నుంచి 13 గ్రామాలకు సమీపంలో 14 కొత్త భద్రతా దళాల శిబిరాలు ఏర్పాటు చేసింది. బీజాపూర్ జిల్లాలోని కొండపల్లి, జిడపల్లి, వట్టెవాగు, కర్రెగట్ట, నారాయణపూర్‌కు చెందిన హొరాడి, గర్ప కచ్చపాల్, కొడలియార్.. సుక్మాలోని తూమల్‌పాడ్, రాయగూడెం, గోలకుంట, గోమగూడ, మెట్టగూడ గ్రామాల్లో కొత్త భద్రత బలగాల క్యాంపులు ఏర్పాటయ్యాయి. జిడీపల్లి గ్రామంలో రెండు శిబిరాలు.. జిడపల్లి గ్రామంలో సవాళ్లతో కూడిన భూ భాగం ఉండడంతో 5 కిలోమీటర్ల మేర రెండు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. శిబిరాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బంది పది మంది, సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) మూడింటిలో.. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) సిబ్బందిని నియమించింది.
ఈ వార్త కూడా చదవండి..
నందమూరి అభిమానులందరికీ ఇదోక ముఖ్యమైన క్షణం
ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 14 మారుమూల ప్రాంతాల్లో తొలిసారిగా జాతీయ జెండా ఎగిరింది. దేశంలో 2026 నాటికి మావోయిస్టులు లేకుండా అంతం చేస్తామని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చిరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారీగా మావోయిస్టులు హతం అయ్యారు. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ మారుమూల ప్రాంతాల్లో జెండా ఎగురవేయడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో మావోయిస్టులపై.. వరుసగా భద్రతా బలగాలు పైచేయి సాధిస్తున్న విషయం తెలిసిందే.
కాగా 76వ గణతంత్ర దినోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతీ ఏడాది జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. దేశవ్యాప్తంగా ఏటా మూడు రంగుల జెండాను ఎగురవేస్తున్నారు. అయితే భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి.. దాన్ని 1950 జనవరి 26వ తేదీన అమలు చేశారు. దీంతో ఆ రోజు దేశం మొత్తం ఒక పండుగలా జరుపుకుంటూ మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసుకుంటున్నాం.
ఈ వార్తలు కూడా చదవండి..
అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
తులసిబాబు పోలికలతో ఉన్న వ్యక్తులతో పరేడ్
నాలుగు పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News