Prashant Kishor: నేను ఎలా సంపాదించానంటే?... పీకే సమాధానం ఇదే
ABN , Publish Date - Feb 12 , 2025 | 06:45 PM
ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన డబ్బులు లేని జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులకు అయ్యే ఖర్చులు తామే భరిస్తామని జన్ సురాజ్ నేత ప్రశాంత్ కిషోర్ చెప్పారు

పాట్నా: 'జన్ సురాజ్ పార్టీ'కి నిధుల వ్యవహారంపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) స్పందించారు. పార్టీ ఫండింగ్‌పై జేడీయూ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తెలివితేటలే తన ఆర్థిక మార్గమనీ, తెలివితేటలతోనే తాను సంపాదించుకున్నానని చెప్పారు.
1984 Anti-Sikh Riots: సిక్కుల ఊచకోత కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ
''పార్టీని నడిపేందుకు తనకు డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. తెలివితేటలే నా ఆదాయమార్గం. ఎవరినైతే సరస్వతీ దేవి అనుగ్రహిస్తుందో వారు తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారు'' అని పీకే వివరించారు.
బెంగళూరులోని ఒక స్వచ్చంధ సంస్థ జన్ సురాజ్ పార్టీకి నిధులిస్తోందని, కిషోర్ సైతం ఆ సంస్థకు రూ.50 లక్షలు డొనేట్ చేశారని, ఇది పన్నుల ఎగవేత అవవకతవకలు (టాక్స్ ఫ్రాడ్)గా కనిపిస్తోందని జేడీయూ ప్రతినిధి, ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ఇటీవల ఆరోపించారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ ఘాటుగా స్పందించారు. తాను ఐఏఎస్ ఆధికారినో, ఐపీఎస్ అధికారినో కాదని, ప్రభుత్వ సర్వీసులో లేనని, కాంట్రాక్టర్‌నో, ఎంపీనో, ఎమ్మెల్యేనో కాదని చెప్పారు. తాను సంపాదించినదంతా తన బుద్ధిని (తెలివితేటలు) ఉపయోగించుకుని సంపాదించినదేనని చెప్పారు. తనలాగేనే బీహార్ యువతకు డబ్బు అనేది పెద్ద సమస్యేమీ కాదని అన్నారు. బీహార్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు లేని జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులకు అయ్యే ఖర్చులు తామే భరిస్తామని చెప్పారు.
పీకే ప్రస్థానం..
ప్రశాంత్ కిషోర్ 2012లో రాజకీయ వ్యూహకర్తగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ తరఫున గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వ్యూహకర్తగా ఉన్నాయి. అప్పుడు మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మోదీ 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కూడా పీకే కీలక పాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది.
ఇవి కూాడా చదవండి..
Kamal Haasan: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Kejriwal: పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.