Uttar Pradesh: సంభల్ మసీదు కమిటీ అధ్యక్షుడి అరెస్టు
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:24 AM
గత ఏడాది నవంబరు 24న మసీదు వద్ద జరిగిన అల్లర్లలో ఆయన ప్రమేయం ఉందన్న ఆరోపణల మేరకు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించేందుకు అధికార్లు రాగా వారిని అడ్డుకునే క్రమంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

సంభల్, మార్చి 23: ఉత్తరప్రదేశ్ సంభల్‌లోని షాహీ జామా మసీదు కమిటీ అధ్యక్షుడు జాఫర్ ఆలీని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది నవంబరు 24న మసీదు వద్ద జరిగిన అల్లర్లలో ఆయన ప్రమేయం ఉందన్న ఆరోపణల మేరకు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించేందుకు అధికార్లు రాగా వారిని అడ్డుకునే క్రమంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటనపై ఆయన వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు అదుపులోకి తీసుకున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. మరోవైపు ఆ ఘర్షణలపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన న్యాయ విచారణ సంఘం సోమవారం ఇక్కడికి రానుంది.