Mayor: పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడే ఆస్తిపన్ను తక్కువ
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:07 AM
పొరుగు రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్(Kerala, Andhra Pradesh)తో పాటు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే ఆస్తి పన్ను మన రాష్ట్రంలోనే తక్కువగా ఉందని చెన్నై నగర మేయర్ ఆర్.ప్రియ(Chennai City Mayor R. Priya) తెలిపారు.
- మేయర్ ప్రియ
చెన్నై: పొరుగు రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్(Kerala, Andhra Pradesh)తో పాటు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే ఆస్తి పన్ను మన రాష్ట్రంలోనే తక్కువగా ఉందని చెన్నై నగర మేయర్ ఆర్.ప్రియ(Chennai City Mayor R. Priya) తెలిపారు. గురువారం చెన్నై కార్పొరేషన్ 44వ వార్డులో రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు(Minister PK Shekhar Babu)తో కలిసి ఆమె ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, చెన్నై నగర పాలక సంస్థలో గత పదేళ్ళలో ఆస్తి పన్నును పెంచలేదని గుర్తు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: సాంకేతిక పరిజ్ఞానంతో దొంగల ఆటకట్టు
2022లో అతి తక్కువ మొత్తంలో ఆస్తి పన్ను పెంచడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్(Kerala, Andhra Pradesh)తో పోల్చితే మన రాష్ట్రంలోనే ఆస్తిపన్ను తక్కువగా ఉందన్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు నగర రహదారులు బాగా దెబ్బతిన్నాయన్నారు. ఈ రోడ్లపై ప్యాచ్ వర్క్‌లు సాగుతున్నాయని చెప్పారు. మరమ్మతులు చేయలేని రహదారులను మాత్రం కొత్తగా వేస్తున్నామన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Formula E Race: ఇదేం ఫార్ములా?
ఈవార్తను కూడా చదవండి: 765 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: అన్నదాతలకు రేవంత్ సున్నంపెట్టే ప్రయత్నం
Read Latest Telangana News and National News