Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్
ABN , Publish Date - Feb 19 , 2025 | 08:26 PM
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ ఓడిన తర్వాత, పంజాబ్ రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యలు మరింత తీవ్రతరంగా మారాయి. అధికారులు, పోలీసులు, స్థానిక నాయకులు ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే 52 మంది అధికారులను సస్పెండ్ చేశారు.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత పంజాబ్(Punjab)లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అవినీతిని కట్టడి చేసేందుకు ఆప్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే పంజాబ్ పోలీసు శాఖలో ఉన్న 52 మంది అధికారులను అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో స్వచ్ఛమైన, సమర్థవంతమైన ప్రభుత్వ విధానాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీంతో అందరూ డిప్యూటీ కమిషనర్లు, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్లు, సీనియర్ సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీస్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, తమ తమ నియమావళి ప్రకారం రూల్స్ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.
అవినీతిని అరికట్టేందుకు
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో అవినీతిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం అవినీతిని అరికట్టేందుకు తీసుకున్న ఒక చర్య మాత్రమే కాకుండా, పంజాబ్ ప్రభుత్వం ఉద్దేశించిన ప్రణాళికలో భాగమని చెబుతున్నారు. ముక్త్‌సర్ జిల్లాలో కమిషనర్ అక్రమాలు, అవినీతి పనుల్లో పాలుపంచుకున్నట్లు ఆరోపణలు రావడంతో, రెండు రోజులకే ఈ చర్యను తీసుకున్న పంజాబ్ ప్రభుత్వం.. అవినీతిని అరికట్టేందుకు తన సంకల్పాన్ని మరోసారి స్పష్టం చేసింది. దీంతో పంజాబ్ ప్రభుత్వం ఇప్పుడు అవినీతిని అరికట్టడంలో అత్యంత అప్రమత్తంగా ఉందని చెబుతోంది.
అవినీతి నిరోధక హెల్ప్‌లైన్
ఈ క్రమంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అవినీతి, లంచం, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై అణిచివేతను అమలు చేస్తూ, జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా లంచం, దుష్ప్రవర్తన, ఇతర అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తుంది. దీంతో అవినీతికి పాల్పడిన ఏ అధికారి అయినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవినీతిని అరికట్టడానికి అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ (9501200200) కూడా ప్రారంభించారు. ప్రజలు తమకు ఎదురయ్యే లంచాలు, అవినీతి ఆరోపణల గురించి సమాచారం అందించాలని సూచించారు.
తక్షణమే చర్యలు..
ప్రజలు ఆడియో లేదా వీడియో రికార్డింగ్‌ల ద్వారా వారి అవినీతిని బయటపెట్టడానికి సపోర్ట్ చేస్తామని, అలాంటి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ ఆదేశాలను సరిగా అమలు చేయని అధికారులపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. పంజాబ్ ప్రభుత్వం తన బడ్జెట్‌లో కూడా అవినీతిపై పోరాటం కోసం ప్రత్యేకమైన నిధులను కేటాయించింది. తద్వారా అవినీతి అరికట్టే చర్యలను మరింత సాధ్యమవుతుంది.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
Read More Business News and Latest Telugu News