Chennai: తిరుచెందూరు ఆలయం వద్ద వెనక్కి మళ్ళిన సముద్రం
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:25 AM
తిరుచెందూరు సెంథిల్ ఆండవర్(Tiruchendur Senthil Andavar) ఆలయం వద్ద సముద్రం రెండోరోజూ వెనక్కి మళ్ళింది. ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వచ్చేస్తుంటారు. అలా వచ్చే భక్తులంతా ఆలయం సమీపంలో ఉన్న సముద్రతీరంలో స్నానం చేసి, నాళికినరు వద్ద పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు.
చెన్నై: తిరుచెందూరు సెంథిల్ ఆండవర్(Tiruchendur Senthil Andavar) ఆలయం వద్ద సముద్రం రెండోరోజూ వెనక్కి మళ్ళింది. ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వచ్చేస్తుంటారు. అలా వచ్చే భక్తులంతా ఆలయం సమీపంలో ఉన్న సముద్రతీరంలో స్నానం చేసి, నాళికినరు వద్ద పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులు అక్కడి సముద్రం వెనక్కిమళ్లుతోంది. బుధవారం ఉదయం సముద్రతీరం 50 అడుగుల మేర వెనక్కి మళ్ళింది.
ఈ వార్తను కూడా చదవండి: Mayor: పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడే ఆస్తిపన్ను తక్కువ
అమావాస్స సందర్భంగా పెరిగే ఆటుపోటుల ప్రభావం వల్ల సముద్రం వెనక్కి మళ్ళినట్లు అధికారులు చెప్పారు. ఈ పరిస్థితులలో గురువారం ఉదయం కూడా మళ్ళీ సముద్రం వెనక్కి వెళ్లింది. ఫలితంగా ఆలయ మండపం నుండి సముద్రతీరం వరకు మెట్లపై నడిచి వేళ్లేందుకు భయపడ్డారు. సుమారు 60 అడుగుల దూరం దాకా సముద్రం వెనక్కి మళ్ళింది. దీనితో సముద్రం స్నానం చేయాలనుకున్న పర్యాటకులు భక్తులు భీతిల్లారు. అలల తాకిడి కూడా అధికమైంది.
ఈవార్తను కూడా చదవండి: Formula E Race: ఇదేం ఫార్ములా?
ఈవార్తను కూడా చదవండి: 765 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: అన్నదాతలకు రేవంత్ సున్నంపెట్టే ప్రయత్నం
Read Latest Telangana News and National News